ప్రపంచాన్ని సైతం గడగడలాడించిన కరోనా వైరస్ మహమ్మారి ఎంతటి ఒడిదుడుకులను తీసుకువచ్చిందో చెప్పాల్సిన పనిలేదు.. దాదాపుగా కరోనా వచ్చి ఇప్పటికీ నాలుగేళ్లు అవుతున్న కరోనా అనే పేరు వినగానే చాలామంది ప్రజలు భయపడుతున్నారు.. ప్రపంచవ్యాప్తంగా 60 లక్షలకు మందికిపైగా మరణించారు.. అయితే కరోనా ప్రభావం తగ్గినప్పటికీ అంతకుమించి ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు సైతం ఎన్నోసార్లు ప్రజలను హెచ్చరించారు.. ఏ సమయంలోనైనా సరే మరోసారి మహమ్మారి పుట్టుక రావచ్చా అని కూడా నిపుణులు తెలియజేయడం జరిగింది. అందుతున్న నివేదిక ప్రకారం జంతువుల నుంచి మానవులకు ఒక కొత్త వైరస్ వ్యాప్తి చెందుతూ ఉందని తెలుపుతున్నారు.


ఈ మహమ్మారి వల్ల ప్రజలకు మరొకసారి అంటు వ్యాధులు వచ్చేలా ఉన్నాయని యూకేయూ నిపుణులు తెలియజేస్తున్నారు. కరోనా మహమ్మారికి చాలా దగ్గర బంధం ఉంటుందని ఇది రెండు సంవత్సరాలుగా ఉండవచ్చని అంతకంటే ఎక్కువ కాలమైన ఉండవచ్చని తెలియజేస్తున్నారు.. ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని ఏది జరిగిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ప్రభుత్వాలు ఉండాలని కూడా తెలుపుతున్నారు. గ్లోబల్ వార్మింగ్ అటవీ నిర్మూలన వల్ల ఈ వైరస్ లో ఉండే బ్యాక్టీరియా జంతువుల నుంచి మనుషులకు సైతం వ్యాప్తి చెందుతోందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.


కోవిడ్ 19 జీవిత కాలంలో ఒకసారి మాత్రమే సోకుతుందని అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా ఆరు మిలియన్లకు పైగా ప్రజలను మట్టు పెట్టింది. అంతకుముందు నాలుగు దశాబ్దాల క్రితం 1981 లో ఈ మహమ్మారి HIV/AIDS ప్రపంచాన్ని చాలా కుదిపేసింది దీని ఫలితంగా 3 కోట్ల ఆరు లక్షల మందికి పైగా మరణించారట.. 1968లో హాంగ్కాంగ్ ఫ్లూ మహమ్మారి వల్ల సుమారుగా కొన్ని మిలియన్ల మంది మరణించారట 1918లో స్పానిష్ ఫ్లూ వల్ల 50 మిలియన్ల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి.. అందుకని ఈసారి కూడా కరోనా లాంటి మరో మహమ్మారి రాబోతోందని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: