సాధారణంగా ఈ భూమి మీద పుట్టిన మనుషుల మధ్య పరిస్థితులకు అనుగుణంగా వైరం ఏర్పడుతూ ఉంటుంది. తద్వారా ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఈ భూమి మీద ఉండే కొన్ని జీవుల మధ్య మాత్రం పుట్టుకతోనే వైరం కొనసాగుతూ ఉంటుంది. అలాంటి వాటిలో కుక్క- పిల్లి, పిల్లి - ఎలుక, లాంటి జీవులతో పాటు ఇక ముంగిస పాములు కూడా ఉంటాయి అని చెప్పాలి. నాగుపాము ముంగిస ఎప్పుడు ఎదురుపడిన బీకర యుద్ధం జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. సాధారణంగా నాగుపాములు ఎంత ప్రమాదకరమైన జీవులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా ఒక చిన్న కాటుతో మనిషి ప్రాణాలను తీసేస్తూ ఉంటాయి పాములు. అందుకే ఎక్కడైనా పాము కనిపించిందంటే చాలు అందరూ భయపడిపోతూ ఉంటారు. కానీ అలాంటి ప్రమాదకరమైన పాము కనిపిస్తే ముంగిస ఎదురెళ్లి యుద్ధానికి దిగుతూ ఉంటుంది. ఏకంగా పాము ప్రాణాలు తీసేంతవరకు కూడా ఊరుకోదు. కొన్ని కొన్ని సార్లుఈ యుద్ధంలో ముంగిస కూడా ప్రాణాలు కోల్పోతూ ఉంటుంది. అయితే పాము ముంగిస పోట్లాటకు సంబంధించిన వీడియోలు చాలానే ఎప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ ఉంటాయి.


 ఇలాంటి వీడియోలను చూసేందుకు అందరూ తెగ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అని చెప్పాలి. ప్రస్తుతం ఇలాంటి తరహా వీడియో మరొకటి వైరల్ గా మారిపోయింది. ఏకంగా ముంగిస, నల్ల నాగుపాము మధ్య భీకరమైన పోరు జరిగింది. ఒకదానిపై మరొకటి పరస్పరం దాడులు చేసుకున్నాయ్. ఏకంగా రక్తం వచ్చేలా గాయాలు కూడా చేసుకున్నాయి. అయితే ముంగిస పాము శరీరంలోని అనేక భాగాలను కరిచి గాయపరుస్తుంది. ఆ ముంగిస నుంచి తప్పించుకోవడానికి పాము శాయశక్తుల ప్రయత్నిస్తుంది. ఇక ఎంతో చాకచక్యంగా పాము నోటిని ముంగిస తన నోటితో పట్టుకుని గింగిరాలు తిప్పేస్తుంది. దీంతో ఆ పాము నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఈ వీడియో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: