ఈ రోజున శ్రీరామనవమి సందర్భంగా చాలామంది రామభక్తులు  భద్రాచలంలో ఉండే శ్రీ సీతారాముల కళ్యాణం ప్రత్యక్ష ప్రసారాన్ని చూసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. భారతీయులందరూ కూడా శ్రీరామనవమిని చాలా గ్రాండ్గా చేసుకుంటారు.కానీ లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం ప్రత్యక్ష ప్రసారాన్ని చేయకూడదంటూ ఏప్రిల్ 4న ఎన్నికల సంఘం పలు రకాల ఆంక్షలు కూడా విధించిందట.. అయితే ఈ నిర్ణయం పైన ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాయడంతో గత 40 ఏళ్లుగా శ్రీసీతారాముల కళ్యాణాన్ని టెలికాస్ట్ చేస్తున్నామని ఇప్పుడు ఆపివేయాలనే నిర్ణయాన్ని ఒకసారి ఆలోచించాలి అంటూ తెలంగాణ దేవదాయ శాఖ నుంచి కొండా సురేఖ ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాశారు. సీతారాముల కళ్యాణం లైవ్ టెలికాస్ట్ ఆపేయండి అంటూ ఈసీ నిర్ణయం తీసుకోవడంతో పలువురు పార్టీలు కూడా అభ్యంతరాన్ని తెలియజేస్తున్నాయి. దేవుడికి ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని లేఖలో తెలియజేయడంతో ఈసీ ఈ విషయం పైన స్పందించారు.ఈ సమయంలోనే ఎన్నికల సంఘం తాజాగా స్పందిస్తూ ఏప్రిల్ 17న సీతారాముల కళ్యాణం ప్రత్యక్షంగా ప్రసారం చేసేందుకు కూడా అనుమతులను జారీ చేసింది.. ఈ రోజున సీతారాముల కళ్యాణం చాలా ఘనంగా ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది. మిథిలా మండపాన్ని చాలా సుందరంగా ముస్తాబు చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో శ్రీరామనామ స్మరణంతో భద్రాచలం ఒక్కసారిగా మారుమోగుతోంది. ఈ కళ్యాణ మహోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు దేవునికి సమర్పిస్తున్నారు.


ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆంక్షలు పాటిస్తూనే సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించబోతున్నారు. ఈ సీతారాముల కళ్యాణం చూడడానికి దేశంలోని ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున  వస్తూ ఉండడంతో ప్రత్యేక అర్చనలు,ఇతరత్రా దర్శనాల టికెట్లను కూడా ఆపివేసి ఉచిత దర్శనాన్ని కల్పిస్తున్నట్లు భద్రాచలం ఆలయ ఈసీ రమాదేవి వెల్లడించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అక్కడ అన్నదాన సదుపాయాన్ని కూడా కల్పించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: