ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ఎన్నో రకాల వీడియోలు వైరల్ గా మారిపోతున్నాయి. ఇలాంటి వీడియోలలో పెళ్లికి సంబంధించిన వీడియోలు కూడా చాలానే ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఏకంగా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఒకే దగ్గర అదిరిపోయే డాన్స్ చేసిన వీడియోలు లేదంటే బంధువులందరూ కూడా పెళ్లి వేడుకలో ఎంజాయ్ చేసిన వీడియోలు ఇలా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి.


 ఇక మరికొన్ని చోట్ల ఏకంగా పీటల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోవడం, విచిత్రమైన కారణంతో వధువు వరుడుని వద్దనుకోవడం లాంటి వీడియోలు కూడా ఇంటర్నెట్ ను షేక్ చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి భారత్ కు సంబంధించిన వీడియో లు కూడా ఇలాగే ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. సాధారణంగా పెళ్లి భారత్లో ఎంతోమంది బంధువులు, స్నేహితులు అదిరిపోయే డ్యాన్సులు చేయడం చూస్తూ ఉంటాం  కానీ ఇక్కడ మాత్రం మనుషులు కాదు ఏకంగా ఒక గుర్రం డాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


 ఈ వివాహ కార్యక్రమంలో వరుడిని గుర్రంపై ఊరేగిస్తూ ఉంటారు. అందుకోసం తెల్లటి గుర్రాన్ని అందంగా అలంకరిస్తారు వరుడి కుటుంబ సభ్యులు. ఆ తర్వాత సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న వరుడుని ఆ గుర్రంపైకి ఎక్కిస్తారు. ఇక అక్కడే డీజే పాటలకు ఎంతో మంది యువకులు డాన్సులు వేస్తూ ఉంటారు. ఈ సందర్భంగా ఒక ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఒక యువకుడు డాన్స్ చేయడం చూసి గుర్రం కూడా కాలు కదుపుతుంది. అది కూడా అచ్చం మనుషుల్లాగానే స్టెప్పులు వేస్తూ ఉంటుంది. ఇక యువకుడు వేసే స్టెప్పులకు అనుగుణంగానే గుర్రం కూడా డాన్స్ చేస్తుంది. ఇక  మధ్య మధ్యలో నేలపై కూర్చుంటూ పైకి లేస్తూ ముందుకు వెనక్కి జరుగుతూ.. అదిరిపోయే స్టెప్పులు వేస్తుంది అని చెప్పాలి. అయితే ఇలా గుర్రం డాన్స్ చేయడం చూసి నేటిజన్స్ అందరు కూడా షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: