సాధారణంగా అటవీ ప్రాంతాల్లో నివసించే ఎంతోమంది జనాలు అటు పావురాలు పిట్టలు లాంటి వాటిని వేటాడి తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక వారికి అదే మటన్ చికెన్ లాంటి ఆహారంగా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పావురాలను వేటాడటానికి ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని పాటిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో మాత్రం ఇలా వేటాడే విషయంలో కూడా వినూత్నమైన క్రియేటివిటీని ఉపయోగిస్తున్నారు. ఇక ఇలాంటి తరహా వీడియోలు చాలానే సోషల్ మీడియాలోకి వచ్చి వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి.


 ఇంత సింపుల్గా కూడా ఏకంగా పక్షులను వేటాడవచ్చా అని అనిపించేలా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. అయితే పావురాలు పట్టుకోవడం విషయంలో కూడా ఇలాంటి క్రియేటివిటీ ఎలా వచ్చింది అని ఇది చూసి నేటిజన్స్ అందరు కూడా షాక్ అవుతున్నారు. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది. కుంగ్రాడ్ అనే యూజర్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియో వైరల్ గా మారిపోయింది. వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే.. ఒక వ్యక్తి పక్షుల మెష్ తయారు చేస్తాడు. అందులో ప్రత్యేకం ఏముంది అనుకుంటున్నారు కదా.


 అయితే ముందుగా ఒక గొయ్యి తీసి దానిపై మెష్ లాంటి దాని ఏర్పాటు చేశాడు. ఇక దాంట్లో విత్తనాలు వేసి పక్షులకు వలవేశాడు. ఇక విత్తనాలను తినడానికి వచ్చిన పావురాలు కింద గుంత ఉంది అన్న విషయాన్ని గమనించలేక పోతాయి. దీంతో ఇక ఆ మెష్ పైనకి వచ్చిన పావురాలు చివరికి గొయ్యిలోకి పడిపోతాయి. ఇలా చాలా పావురాలు పక్షులు అందులోకి చేరుతాయి. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఇది చూసి పక్షులను పట్టుకోవడం విషయంలో కూడా ఇంత క్రియేటివిటీ ఏంటి అని కొంతమంది నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంతమంది పక్షులను హింసించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో పై ఒక లుక్ వేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: