
వేణు అనే యువకుడు తన వివాహాన్ని సైతం రద్దు చేసుకువడంతో అందరూ ఆశ్చర్యపోయారు. గతంలో పెళ్లి చేసుకోబోయే వధువు మరొక యువకుడితో ప్రేమాయణం నడిపిందని ఆరోపణలు చేశారు. అయితే పెళ్లికి ముందు అన్ని విషయాలు కూడా వరుడికి చెప్పానని ఆ వధువు తెలియజేస్తుందట. అప్పుడు అన్ని విషయాలకు సరేనని ఒప్పుకొని మరి.. రాత్రికి రిసెప్షన్ కూడా చేసుకున్నామని సరిగ్గా కళ్యాణ మండపానికి వచ్చేసరికి పెళ్లికి వరుడు సైతం నిరాకరించారని వధువు ఎమోషనల్ గా కన్నీళ్లు పెట్టుకొని తెలియజేస్తోంది.
దీంతో అటు వధువు వరువుల కుటుంబ సభ్యులు ఇద్దరు కూడా పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని వధువు కుటుంబ సభ్యులు సైతం పోలీస్ స్టేషన్లో డిమాండ్ చేయడం జరిగింది. ఇది కర్ణాటక ప్రాంతంలో జరిగినట్లుగా తెలుస్తోంది. మరి ఈ విషయం పైన అటు కుటుంబ సభ్యులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు మరి అక్కడ పోలీస్ అధికారులు ఎవరికీ న్యాయం చేస్తారు అనే విషయం ఇంకా తెలియాల్సి ఉన్నది. మొత్తానికి ఈ విషయమైతే ఇప్పుడు అక్కడ వారందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది.