
అవాచా బే వద్ద ఉన్న కామ్చాట్ స్కీ నగరం పరిసరాల్లో భవనాలు గడగడలాడాయి. ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విద్యుత్, సెల్‌ఫోన్ సేవలు నిలిచిపోయాయి. అయితే ఇప్పటివరకు ప్రాణ నష్టం జరిగినట్టు అధికారిక సమాచారం రాలేదు . ఇండియన్స్‌కి బిగ్ వార్నింగ్..! .. ఈ ప్రకంపనల ప్రభావం ఉత్తర పసిఫిక్ అంతటినీ వణికిస్తోంది. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ స్పందిస్తూ.. అమెరికాలోని భారతీయులకు హెచ్చరికలు జారీ చేసింది. కాలిఫోర్నియా, హవాయి, వాషింగ్టన్ వంటి తీరప్రాంతాల్లో నివసిస్తున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలను తప్పకుండా పాటించాలని కోరింది. అత్యవసర సమయంలో ఎమర్జెన్సీ నంబర్లను సంప్రదించాల్సిందిగా తెలిపింది.
ట్రంప్ కౌంటర్ – ప్రజలకు ధైర్యం..! .. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. హవాయి వంటి తీరప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు ఉన్నాయని తెలిపారు. ప్రజలంతా పానిక్ కాకుండా, సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించారు. ప్రకృతి ముందెప్పుడూ బలహీనమే.. కానీ స్పందన శక్తివంతంగా ఉండాలి! .. ఒక భూకంపం... రెండు దేశాలకు, మూడు ఖండాలకు కలకలం. పసిఫిక్ మహా సముద్ర పరిసర దేశాలకి ఇది గట్టి హెచ్చరిక. ఆధునిక సాంకేతికత ఉన్నా.. ప్రకృతిని ఎదుర్కొనే దమ్ము మనిషికి ఇంకా రాలేదని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది. భూమి ఒణికితే ప్రపంచమే వణుకుతుంది!