గ్యాస్ సిలిండర్ కోసం రోజుల తరబడి వెయిట్ చేస్తున్నారా? అయితే మీకు ఇలాంటి మెసేజ్ రావచ్చు. ప్రముఖ గ్యాస్ కంపెనీలైన ఇండియన్ (Indane), భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ లోగోలను వాడుతూ స్కామర్లు ఎస్‌ఎమ్‌ఎస్‌లు, వాట్సాప్ సందేశాలు పంపుతున్నారు. "మీ సిలిండర్ రేపే కావాలా? అయితే ఈ లింక్ క్లిక్ చేసి ఇప్పుడే అమౌంట్ పే చేయండి" అని నమ్మిస్తారు.ఆ లింక్ క్లిక్ చేయగానే అది మిమ్మల్ని ఒక నకిలీ వెబ్‌సైట్‌కి తీసుకెళ్తుంది. అక్కడ మీ బ్యాంక్ వివరాలు, యూపీఐ (UPI) పిన్ లేదా ఓటీపీ (OTP) ఎంటర్ చేశారో.. అంతే సంగతులు! గ్యాస్ రాదు సరే కదా, మీ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న పైసా కూడా మిగలదు.
యాదృచ్ఛిక లింక్‌లు, SMSలు లేదా సోషల్ మీడియా ద్వారా ఎలాంటి ముందస్తు చెల్లింపులు కోరబోమని స్పష్టం చేశాయి. నిపుణుల సూచనల ప్రకారం LPG సిలిండర్‌ను ఎప్పుడూ అధికారిక వెబ్‌సైట్ లేదా అధికారిక మొబైల్ యాప్ ద్వారానే బుక్ చేసుకోవాలి. తెలియని లింక్‌లపై క్లిక్ చేయడం, అనుమానాస్పద వెబ్‌సైట్‌లలో బ్యాంక్ లేదా UPI వివరాలు నమోదు చేయడం వంటి చర్యలను పూర్తిగా నివారించాలి. అలాగే OTP, UPI పిన్, బ్యాంకింగ్ వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదు.
ఏదైనా అనుమానాస్పద సందేశం లేదా కాల్ వచ్చినట్లయితే వెంటనే అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ ఇలాంటి మోసానికి గురైతే వెంటనే భారత సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. వేగంగా స్పందిస్తే డబ్బు తిరిగి పొందే అవకాశాలు కూడా పెరుగుతాయని వారు చెబుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి