చాలా మంది రాత పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నా ఇంటర్వ్యూల్లో విజయం సాధించలేక మంచి ఉద్యోగావకాశాలను కోల్పోతూ ఉంటారు. ప్రస్తుత కాలంలో ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యం. మన శరీరం యొక్క ప్రతి కదలిక బాడీ లాంగ్వేజ్ లో భాగమే. మన చూపు, మనం నిలబడే తీరు, ముఖకవళికలలో నైపుణ్యాలే మనం విజయానికి దగ్గరయ్యేలా చేస్తాయి. 
 
మన బాడీ లాంగ్వేజ్ ఆలోచనలను, ఫీలింగ్స్ ను, ఎమోషన్స్ ను ఎల్లప్పుడూ కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. పరిశోధకులు ఎన్నో పరిశోధనలు చేసి భావ వ్యక్తీకరణలో 50 శాతం కంటే ఎక్కువగా బాడీ లాంగ్వేజ్ ప్రభావం ఉంటుందని చెప్పారు. ఇంటర్వ్యూల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, బిహేవియర్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్ ఇంటర్వ్యూలో విజయానికి కారణమవుతాయి. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభే ఉద్యోగ ఎంపికలో కీలక పాత్ర పోషిస్తుంది. 
 
కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా బాడీ లాంగ్వేజ్ ను మెరుగుపరచుకోవచ్చు. చాలా మంది ఎదుటి వ్యక్తులతో మాట్లాడే సమయంలో చేతులు కట్టుకుంటూ ఉంటారు. చేతులు కట్టుకుంటున్నారంటే అవతలి వ్యక్తి చెబుతున్న విషయాలను అంగీకరించడం లేదని అర్థం. బాడీ లాంగ్వేజ్ లో ముఖ కవళికలు అతి ముఖ్యమైనవి. మన మానకిక పరిస్థితి ముఖ కవళికల్లో ఎల్లప్పుడూ స్పష్టంగా కనిపిస్తుంది. 
 
ఇతరులతో మనం మాట్లాడే సమయంలో మన శరీరం ఎటువైపు తిరిగి ఉందో గుర్తుంచుకోవాలి. బాడీ లాంగ్వేజ్ లో కళ్లు ప్రధానంగా చాలా విషయాలు చెబుతాయి. కళ్లు ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసం గురించి ఇతర వ్యక్తులకు చెబుతాయి. ఇతరులతో మాట్లాడే సమయంలో రిలాక్స్ గా ఉండాలి. బాడీ లాంగ్వేజ్ లో కొన్ని మార్పులు చేసుకుని ఇతరులతో మాట్లాడటం వల్ల ఎలాంటి పనిలోనైనా సులభంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది.                    

మరింత సమాచారం తెలుసుకోండి: