జీవితంలో ఎన్నో జరుగుతుంటాయి..కొన్ని మనకు నచ్చినవి జరగొచ్చు, మరికొన్ని నచ్చనివి జరగొచ్చు...కానీ మన జీవితం అక్కడే ఆగిపోకూడదు. జరిగిపోయిన గతాన్ని తలుచుకుంటూ జీవించకూడదు. గతంలో జరిగిన లేదా చేసిన పొరపాట్లను గుర్తించి కొత్త జీవితానికి స్వాగతం చెప్పాలి. అంతేకాకుండా జీవితంలో మీరు ఎలా అయితే మీ కలలను సాకారం చేసుకోవాలనుకుంటున్నారో ఆ దిశగా అడుగులు వేయడం ప్రారంభించాలి. అప్పుడే మీరు అనుకున్నవి అన్నీ జరుగుతాయి. ఈ జీవితం ఎవరికీ అంత సులభం కాదు..అలాగే మనము అనుకున్నంత కష్టమూ కాదు. ప్రయత్నిస్తే ఎంతటి కష్టమైన పనైనా నెరవేరుతుంది.
 
జీవితం అనేది మనకు మనముగా ప్లాన్ చేసుకుని బ్రతకడానికి అవకాశం ఉండదు. ఏ క్షణం ఏమి జరుగుతుందో తెలియదు...అన్నింటికీ సిద్ధపడి ఉండాలి..అప్పుడే మీ జీవిత ప్రయాణంలో ఎదురయ్యే చిన్న చిన్న అవరోధాలను అతి సులభముగా దాటగలుగుతారు. జీవితంలో అనేక సవాళ్లు మీకు ఎదురవుతాయి.. వాటిని తట్టుకుని నిలబడానికి మీకు ఆత్మస్థైర్యం ఎంతైనా అవసరం. గతంలోని మీ పొరపాట్లను మీ యొక్క గెలుపుకు మెట్లుగా ఉపయోగించుకోండి. మనము ఇతరులపై జాలి మరియు కరుణ చూపించడానికి ఎప్పుడూ వెనుకాడకూడదు. ఇవే మీకు తప్పకుండా ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతాయి.

ఏ సమస్య నుండైనా బయపడాలంటే ఆలోచనా విధానం, తెలివి తేటలు, వేగంగా నిర్ణయం తీసుకునే తత్వం మరియు  సమయస్ఫూర్తి ఇవన్నీ కలిగి ఉండాలి. అప్పుడే చాక చక్యంగా ఎంతటి సమస్య నుండి అయినా బయట పడగలము. ఇలానే జీవించాలని కోరుకోవడంలో తప్పులేదు.... కానీ మన జీవితంలో ఇదే జరగాలి అని లెక్కలు వేసుకోవడం తప్పే అవుతుంది. సంతోషాన్ని స్వీకరించాలి.... సమస్య వస్తే కుంగిపోకుండా పరిష్కరించి దానిని అధిగమించాలి. అప్పుడే మన లైఫ్ సాఫీగా సాగుతుంది. జీవితం సుఖ దుఃఖాల సంయోగం.... దీన్ని అర్థం చేసుకుని అనుకరిస్తే అంతా సజావుగానే ఉంటుంది. ఏది ఏమైనా నమ్మకాన్ని కోల్పోకుండా.... ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: