ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ మ‌నుషుల జీవితాల‌ను ఛిన్నాభిన్నం చేస్తోంది. మాన‌వ సంబంధాల మ‌ధ్య చిచ్చు పెడుతోంది. మనిషికి మనిషికి మధ్య దూరం పెంచేసింది. మ‌నుషుల్లోని మానవీయతాహాను కబలించేస్తోంది. ప్రజలకు ఉపాధి లేకుండా చేస్తోంది. మ‌రి కొంద‌ర్ని పిచ్చివాళ్ల‌గా చేస్తోంది.
ఎటు చూసినా ఏ వైపు చూసినా... ఎవరి నోట విన్నా కరోనా పేరే వినిపిస్తోంది. అంతగా ప్రజలను కలవరపెడుతోంది ఈ మహమ్మారి. గత ఏడాది నుండి మనకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ.. మనశ్శాంతిని పోగొడుతోంది. ప్రశాంతంగా బయట తినలేక పోతున్నాం, తిరగలేక పోతున్నాం... అలా అని ఇంట్లో ప్రశాంతంగా ఉండలేక పోతున్నాం.

ఎటువైపు నుంచి, ఏ రూపంలో కరోనా శరీరంలోకి ప్రవేశిస్తుందో తెలియదు. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ, తెలియక చేసే ఒక చిన్న పొరపాటు వైరస్ బారిన పడేలా చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో కరోనా వార్తలు చూస్తుంటే మరింత టెన్షన్ పెరిగిపోతుంది. ఇలా ఇవన్నీ చేరి మానసిక ఒత్తిడిని పెంచేస్తున్నాయి. ఈ కరోనా గురించి ఆలోచిస్తూ... స్ట్రెస్ ఎక్కువై చాలామంది సమయానికి నిద్రపోవడం లేదు, సమయానికి తినడం లేదు, అధిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఇవన్నీ కలసి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వాస్తవానికి కరోనా అయినా... మరి ఏ వ్యాధి నుండి బయటపడాలన్నా సరే ముందుగా సదరు రోగికి మనోబలం  ఉండాలి. మానసిక ఒత్తిడికి లోనవ్వకూడదు, ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండాలి.

మనసుకు ప్రశాంతత నిచ్చే పనుల్లో నిమగ్నం అవ్వాలి. మంచి బలమైన పోషకాహారాన్ని తినాలి. మన శరీరం అన్నిటికీ సిద్ధంగా ఉంటుంది. దేన్నయినా ఎదుర్కోగల సామర్థ్యాన్ని పొందుతుంది. ఇది మన జీవితంలో తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. కాబట్టి మీరు వీలైనంత వరకు మీ మనసుకు ప్రశాంతతనిచ్చే పనులు చేయండి. ఒత్తిడికి లోనయ్యే వార్తలకు దూరంగా ఉండండి. కొంతమంది అయితే ఎవరైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆ విషయం గురించి పదే పదే మాట్లాడుతూ ఇంకా వారికీ భయాన్ని కలిగిస్తారు. అలాంటి వారికి దూరంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: