కాస్త ఏమరుపాటుగా ఉన్నా శత్రువు మనపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాడు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనం జాగ్రత్తగా ఉండి ఒక కంట కనిపెడుతునే ముందుకు సాగేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. కాలమే కాదు శత్రువులు కూడా మనకు ఎన్నో పరీక్షలు పెడుతుంటారు. సమస్యలను సృష్టిస్తుంటారు వాటిని తెలివిగా సమయ స్ఫూర్తితో ఎదుర్కొని వాటిని అధిగమిస్తేనే మీరు కోరుకున్న లక్ష్యాన్ని చేరుకుని విజయాన్ని అందుకోగలరు. మనము ఏ రంగంలో ఉన్నాము అందులో ఒక స్థాయిలో ఉండాలి. మన చుట్టూ ఉన్న ప్రత్యర్ధులు సైతం మన ప్రణాళికలు చూసి వెనుకంజ వేసేలా ఉండాలి. ఎప్పుడైతే మనము భయపడుతామో అప్పుడే ఓటమిని అంగీకరించినట్లు అవుతుంది. శత్రువులను ఎదుర్కోవడానికి వారితో పోటీపడి వారిని ఓడించి విజయాన్ని సొంతం చేసుకోవడానికి మనం కొన్ని సూత్రాలను గుర్తుంచుకోవాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి