ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అయితే ఈ రోజుల్లో ఆరోగ్యాని కన్నా డబ్బుకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక అందు లోనూ విజయం అందుకోవాలని అత్యుత్సాహంతో వాయు వేగంతో పరుగులు తీసే వారి సంఖ్య కూడా ఎక్కువే. అనుకున్నది సాధించాలనే తపన ఉండటం తప్పు కాదు. కానీ ఆశయం కోసం ఆరోగ్యాన్ని పక్కన పెట్టరాదు. విజయాన్ని పొందాలనే ఆలోచనలతో పూర్తిగా సతమతమైపోకండి. మీ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొనసాగడం కూడా అవసరమే. నేటి కాలంలో పనులని, ఉద్యోగాలు అని ఉన్నతి కోసం ఈ సమాజంలో తమకు గుర్తింపు లభించడం కోసం అంతా నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు.

అయితే సమయంతో పోటీ పడే తరుణంలో ఆరోగ్యాన్ని పక్కన పెట్టేస్తున్నారు. ముఖ్యంగా బయట ఆహారానికి ఎక్కువ గా అలవాటు పడుతున్నారు. ఇంటి భోజనమే సురక్షితం, ఆరోగ్యం, శ్రేయస్కరం అన్న విషయం తెలిసిందే. అయినా అనుకున్నది సాధించాలని ఉరకలు వేస్తూ బయట దొరికింది అంతో ఇంతో తినడం మళ్ళీ తమ తమ పనుల్లో బిజీ అయిపోవడం. ఇంకొందరు అయితే అసలు వేళకి తినడం అంటే పెద్ద టాస్కే, టైం కి తినరు, సమయానికి నిద్రపోరు ఇలా ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఎపుడు పని మీదే ధ్యాస పెట్టడం జీవితంలో ఉన్నతి సాధించాలనే పట్టుదలతో అదే విధిగా అంటుంటారు.

కానీ ఆరోగ్యం చాలా విలువైనది. ఆస్తిపాస్తులు, ధనం, పేరు ప్రతిష్టలు వీటన్నిటికంటే ఆరోగ్యం చాలా విలువైనది. ఆరోగ్యాన్ని అశ్రద్ద చేస్తే అనారోగ్య పాలు కావాల్సి వస్తుంది. అందుకే ముందు జాగ్రత్త అవసరం. విజయం సాధించాలనే పట్టుదలతో పాటుగా ఆరోగ్యం విషయం లోను కాస్త శ్రద్ద చూపించాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా సమయానికి ఆరోగ్యకరమైన ఆహారం తినడం , వేళకి నిద్రపోవడం ఉత్తమం. లేకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు పడుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: