హిందువులు చాలా మంది రాత్రి సమయం లో దీపారాధన చేసే అలవాటును కలిగి ఉంటారు. ఇందులో భాగంగా దేవుడికి పూజ చేసే సమయంలో దూపం, కర్పూర హారతిని ఇస్తుంటారు. అలా కర్పూర హారతి ఇవ్వడం శుభ ప్రదంగా భావిస్తుంటారు.  అయితే కర్పూర హారతిని ఇవ్వడం వలన ఆ ఇంట్లోని వారికి విజయాలు అందే అవకాశాలు పెరుగుతాయి, సులభంగా విజయం దక్కుతుందట. మరి అది ఎలాగో తెలుసుకుందాం పదండి.
 
* మాములుగా కొందరి ఇంట్లో వాస్తు దోషం వలన కూడా చాలా మందికి విజయం వరించదు. అలాంటి వారు  ఇంటి వాస్తు దోషం తొలగించుకోవాలి అంటే ఇంటి మూలల్లో కర్పూరం పెట్టాలి, కర్పూరం కరుగుతున్న కొద్ది  అది సానుకూల పరిస్థితులను ఏర్పడేలా చేసి మంచి చేస్తుందని, విజయం సిద్ధిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. దీంతో ఇంటి వాస్తు దోషాలు తొలగి పాజిటివ్ ఎనర్జీతో ఇల్లు నిండి మంచి జరుగుతుందని అంటున్నారు .

* ఇంట్లో కర్పూరం వెలిగించడం చెత్త, ఇంట్లో సానుకూల శక్తి వ్యాపించడం మొదలయ్యి వారి జీవితాలలో పురోగతి మొదలయ్యి అలాగే విజయానికి మార్గం తెరుస్తుంది అని చెబుతున్నారు. ఇది కుటుంబంలో విభేదాలను తగ్గించి... ఆనందం, శాంతి మరియు శ్రేయస్సును పొడిగిస్తుందట.

* శాస్త్రాల ప్రకారం, ఇంట్లో ధూపం లేదా కర్పూరం వెలిగించుట వలన మనస్సు ప్రశాంతంగా మారుతుంది. మనలోని బాధలు తొలగి ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందట. ధూప దీపం మరియు కర్పూరం నుండి వెలువడే సువాసన ఇల్లు అంతటా వ్యాపించి మనస్సును సంతోషంగా మరియు ప్రశాంతంగా ఉంచడానికి సహాయ పడుతుంది అని అంటున్నారు . ఇది ఒత్తిడిని చాలా వరకు తగ్గించి చురుగ్గా పనిచేసేలా చేస్తుందట. అయితే మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి .

ఇలా కర్పూరం మీ జీవితంలో విజయాన్ని సిద్దింప చేస్తుందని వేద పండితులు అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: