బంజార మటన్ కావాల్సిన పధార్ధాలు : మటన్ : 500 గ్రాములుస టమోటాలు : 150 గ్రా ఉల్లిపాయలు : 50 గ్రా నూనె : 50 గ్రా గరంమసాలా : 2 గ్రా పచ్చిమిర్చి : నాలుగు అల్లం : చిన్న ముక్క  ధనియాల : 2 టీ స్పూన్లు  ఎండుమిర్చి : మూడు ఎండుమెంతికూర : ఒక టీ స్పూన్ ఉప్పు : తగినంత

తయారు చేసివిధానం : మటన్ ని శుభ్రంగా కడిగి గిన్నెలో వేసి కొంచెం ఉప్పు, గరం మసాలా కలిపి మెత్తగా ఉడికించాలి. ఒక గిన్నె లో నూనె పోసి కగాక సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కల్ని ఎర్రగా వేయించండి. తరువాత పచ్చిమిర్చి, అల్లం ముక్కులు వేసి కొద్ది సేపు ఫ్రై చేయండి, తరువాత దంచిన ధనియాలు, ఎండుమిర్చి కలిపి, ఉడికించిన మాంసాన్ని కూడా వేయండి.

ఈ మిశ్రమంలో టమోటా ముక్కల్ని వేసి సన్నని మంట మీద గ్రేవీ పూర్తిగా ఉడికే వరకూ వుంచి ఉప్పు సరి చూడండి, ఇప్పుడు దానిమీద మెంతికూర జల్లితే బంజార మటన్ రెడీ.

మరింత సమాచారం తెలుసుకోండి: