తయారు చేయువిధానం: గుడ్లను పావు గంట సేపు ఉడికించి, దింపి పెంకు ఒలిచి చాకులో గాట్లు పెట్డండి. ఒక గిన్నెలో నూనె పోసి కాచాక – ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు పెట్టండి. ఆ తరువాత నువ్వులు, వేరుశనగపప్పు, కొబ్బరి, వేయించి మెత్త గా నూరి మసాలా ముద్దను తయారు చేయండి.
ఇప్పుడు ఈ మసాలాను తాలింపు లో వేసి, కొంచెం సేపు వేయించండి. నూనె ఆ ముద్ద నుండి విడిపోతున్నప్పుడు కారం, పసుపు, వేసి కలిపాక చింతపండు పులసు పోసి ఉడికించండి. తరువాత తగినంత ఉప్పు కలిపి గ్రేవీలా తయారయ్యాక ఉడకబెట్టిన గుడ్లును వేసి, కాసేపు ఉడికిస్తే బగారా అండా కర్రీ రెడీ ఇది రైస్ తో వడ్డిస్తే చాలా బావుంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి