ఒక స్త్రీ సంపూర్ణంగా ఆనంద పడెక్షణాలు ఏవంటే మంచి భర్త దొరికినప్పుడు, అలాగే తాను తల్లి అవుతున్నానని తెలిసినప్పుడు. అమ్మ తనంలోని కమ్మదనం ఎంతగా చెప్పిన తక్కువే. అది ఈ సృష్టిలో ప్రతి ప్రాణి అనుభవిస్తుంది. కాని మనుషుల్లో మాత్రం దీని తాలూకు భావాలు మాటల్లో చెప్పే వీలుంది.

 

మిగతా జీవరాశి కంటే మానవజాతిలో పుట్టిన ఆడపిల్లకు తాను తల్లిలా మారుతున్న క్షణం నుండి పుట్టబోయే బిడ్డపట్ల బాధ్యత పెరుగుతుంది. పుట్టినాక మాత్రమే కాదు. అతను ప్రయోజకుడు అయ్యేదాకా తల్లి దండ్రుల పాత్ర ఎంతగొప్పదో అనుభవించే వారికే తెలుస్తుంది.

 

ఇక ఒక మహిళ తాను గర్బం ధరించినప్పటి నుండి ప్రసవం వరకు ఎంతో జాగ్రత్తగా ఉంటేగాని ఆ ఫలం విజయవంతంగా చేతికి అందదు. ఇక ఇలాంటి పరిస్దితుల్లో పండంటి బిడ్డకోసం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుంటే. ఆరోగ్యమైన శిశువు కొరకు ఎక్కువపాలు, పండ్లు, ఆకుకూరలు, పప్పు, మాంసము, చేపలు మొదలైనవి తీసుకోవాలి.

 

మొదటి ఆరునెలలకు నెలకొకసారి, ఏడు, ఎనిమిది నెలల్లో నెలకు రెండు సార్లు, తొమ్మిదోనెలలో వారానికొకసారి వైద్యపరీక్షలు చేయించడం అవసరం. ఇంతే కాకుండా సొంతంగా మందులు వాడడము, ఎక్సేరేలు తీయించడం చేయకూడదు.. ముఖ్యంగా ఎత్తుమడమల చెప్పులు అసలే వాడకండి దీనివల్ల వెన్నుపూసమీద అధిక భారం పడుతుంది..

 

ఇకపోతే  గర్భం ధరించిన స్త్రీలు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. దీంతో పుట్టబోయే శిశువు కూడా అలాగే ఉంటుంది. మొదటి మూడునెలలు, చివరి నెలలో దూరప్రయాణాలు, కారు స్కూటరు నడపడము, చేయరాదు. రాత్రులు 8-10 గంటలు, పగలు 1 గంట నిద్ర లేదా విశ్రాంతి తప్పని సరిగా తీసుకోవాలి. నిద్రపోవుచున్నపుడు ఒక ప్రక్కకు వీలైతే ఎడమ వైపు తిరిగి పడుకోవాలి.  స్త్రీలు గర్భము దాల్చిన మూడు మాసముల తరువాత, ప్రసవించిన మూడు మాసముల వరకు యోగ విద్య అభ్యసించ రాదు.

 

వీలైతే ఉదయం  సమయంలో మెల్లగా వాకింగ్ చేస్తే మంచిది.  ధనుర్వాతం బారినుండి రక్షణకోసము టెటనస్ టాక్షాయిడ్ ఇంజక్షన్‌లు తీసుకోవాలి . రక్తస్రావము, ఉమ్మనీరు పోవడము, శిశువు కదలిక తగ్గినట్లు అనిపించినప్పుడు, కడుపు నొప్పి వచ్చిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.  ఇక బరువులు అసలే ఎత్తకుడదు. ఇలాంటి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పండంటి బిడ్దను పొందే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: