నిర్భయ దోషులను ఉరి తీసేరోజు ఎప్పుడో తెలుసా ? ఈనెల 22వ తేదీన ఉదయం 7 గంటల్లోపు నలుగురు దోషులను ఉరి తీయాలని డిసైడ్ అయిపోయింది.  తమను ఉరి తీయాలన్న ఢిల్లీ హై కోర్టు తీర్పును సవాలు చేస్తు  నలుగురు దోషుల్లో వినయ్, ముఖేష్ క్యురేటివ్ పిటీషన్ పెట్టుకున్నారు. అయితే వీరి పిటీషన్ ను పరిశీలించిన సుప్రింకోర్టు ఈరోజు కొట్టేసింది. అంటే వీళ్ళకు మిగిలింది రాష్ట్రపతి క్షమాబిక్ష మాత్రమే. ఈ అవకాశం కూడా ఒకసారి వీగిపోయింది లేండి.

 

నిజానికి నలుగురు దోషులను ఉరి తీయటానికి ఢిల్లీలోని తీహార్ జైల్లో అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఉరి తీయటానికి ముందు వేసే ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు. ఉరి తీయటానికి పరిస్ధితులు  అన్నీ సవ్యంగానే ఉన్నట్లు అధికారులు నిర్దారించుకున్నారు. అయితే పై ఇద్దరు సుప్రింకోర్టులో పిటీషన్ వేయటంతో  ఉరిశిక్ష అమలులో  జాప్యం జరిగింది.

 

ఇపుడు సుప్రింకోర్టు కూడా వీరి పిటీషన్ ను కొట్టేయటంతో  ఉరిశిక్షను అమలు చేయటానికి దాదాపు అడ్డంకులన్నీ తొలగిపోయినట్లే భావించాలి. దాదాపు ఆరేళ్ళ క్రితం ఢిల్లీలోని ఓ బస్సులో నిర్భయ అనే యువతిని పాశవికంగా మానభంగం చేయటమే కాకుండా ఒళ్ళంతా కుళ్ళబొడిచిన విషయం దేశంలో సంచలనంగా మారింది.  నిర్భయను రేప్ చేసి గాయపరచటమే కాకుండా ఆమె బాయ్ ఫ్రండ్ ను కూడా చచ్చేట్టు కొట్టి, బట్టలూడదీసి చలికాలంలో బస్సులో నుండి  బయటకు తోసేశారు.

 

సంఘటన వెలుగు చూడగానే దేశమంతా అట్టుడుకిపోయింది. అప్పటి నుండి అనేక సంవత్సరాలుగా కేసు దర్యాప్తు, విచారణ అనుకున్నంత స్పీడుగా జరగలేదని అందరికీ తెలిసిందే. అయితే హైదారబాద్ శివారలోని శంషాబాద్ లో జరిగిన దిశ హత్యాచారం ఘటన తర్వాత దేశం అంతా భగ్గున మండింది. దాని ప్రభావమే నిర్భయ విచారణ మీద కూడా పడింది. చివరకు యుద్ధ ప్రాతిపదికన నలుగురు దోషులకు ఉరిశిక్షను ఖరారు చేస్తు హై కోర్టు తీర్పివ్విటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: