కన్న తల్లే కూతురి బతుకును ఆగం చేయాలని చూసింది. అమ్మా! తల్లి తన బిడ్డను కడుపులో 9మాసలు మోస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఆ బిడ్డను ఎంతో అపురూపంగా చూసుకుంటుంది. ఇక అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురునైతే ఘనంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపాలని కలలు కంటుంది. కాని, దానికి విరుద్దంగా కూతురి భ‌ర్త‌తోనే బిడ్డ‌ను క‌న్న‌ది ఓ త‌ల్లి. వివ‌రాల్లోకి వెళ్తే.. ``నా మొగుడిని, నా తల్లే పెళ్లాడింది..`` అంటూ బ్రిటన్ కు చెందిన ఓ యువతి, వివాహం అనంతరం తనకు ఎదురైన ఓ అనుభవాన్ని ఫేస్ బుక్ లో షేర్ చేసుకోగా, అదిప్పుడు వైరల్ అయింది. యువతి పేరు లారెన్ వాల్. ఆమె పెట్టిన పోస్టులో భర్త నుంచి విడిపోయి ఓ మ‌హిళ జూలీ పాల్‌.. తన కుమార్తె లారెన్ ను అల్లారుముద్దుగా పెంచింది. 

 

అయితే లారెన్ వాల్ కి చిన్నప్పటి నుంచి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలని కల ఉండేది. ఆమె కలను తల్లి తీర్చింది దాదాపు రూ.14లక్షలు ఖర్చు చేసి 2004లో లారెన్ కి వివాహం జరిపించింది ఆమె తల్లి. ఇక ఆపై వారిద్దరూ హనీమూన్ కు బయలుదేరగా, ఒంటరిగా ఉన్న తన తల్లి జూలీ పాల్ ను కూడా లారెన్ తీసుకెళ్లింది. అదే ఆమె చేసిన పెద్ద తప్పు... కొత్తగా పెళ్లైన దంపతుల మధ్యలోకి లారెన్ తల్లి జూలీ వచ్చింది. ఆ సమయంలో వారిద్దరి ప్రవర్తన తేడాగా ఉన్నా, లారెన్ కు ఏ విధమైన అనుమానం కలగలేదు. ఆపై గర్భం దాల్చిన లారెన్, పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. జూలీ దగ్గరే లారెన్, ఆమె భర్త ఉంటున్న నేపథ్యంలో, జూలీకి, అల్లుడికి మధ్య వివాహేతర బంధం ఏర్పడగా, జూలీ కూడా గర్భం దాల్చి మరో బిడ్డకు జన్మనిచ్చింది. 

 

తన బిడ్డకు అల్లుడే తండ్రని ఆమె స్పష్టం చేయడంతో లారెన్ శోక‌సంద్రంలో మునిగిపోయింది. ఒక తల్లి కుమార్తె విషయంలో ఇలా చేయడాన్ని లారెన్ దిగమింగుకోలేకపోయింది. ఇటువంటి తల్లిని ఎప్పటికీ  క్షమించబోనని లారెన్ పేర్కొంది. ఇక తన వివాహం 2004లో జరిగిందని, 2005లో తాను, 2009లో తన తల్లి ఒకే వ్యక్తి కారణంగా తల్లులుగా మారామని చెప్పిన లారెన్, 10 సంవత్సరాల పాటు ఈ విషయాన్ని తన మనసులో దాచుకున్నానని చెబుతూ వాపోయింది. ఇక ఆపై జూలీ, అల్లుడిని వివాహం చేసుకోగా, ఆ పెళ్లికి లారెన్ కూడా హాజరు అవ్వ‌డం విశేషం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: