తినే ఉంటారు లెండి.. ఎందుకంటే మన అమ్మ ప్రతిరోజు ఈ మంచి వేపుడు ఏ కదా చేసిపెట్టేది. అమ్మ చేసినప్పుడు గబా గబా తినేస్తాం కానీ ఎలా చెయ్యాలి అనేది మాత్రం నేర్చుకోము. కానీ మనకు ఆ బీన్స్ కర్రీ అమ్మ చేసినట్టు రావాలి అంటే ఎలా చెయ్యాలో ఇక్కడ చదివి తెలుసుకోండి. ఆ బీన్స్ వేపుడుని తిని అమ్మవంటకాన్ని గుర్తుచేసుకోండి. 

 

కావాల్సిన పదార్ధాలు..  

 

ఫ్రెంచ్‌ బీన్స్‌ - అరకేజీ, 

 

ఆవాలు - ఒక టీస్పూన్‌, 

 

కరివేపాకు - ఒక కట్ట, 

 

పసుపు - అర టీస్పూన్‌, 

 

నూనె - రెండు టీస్పూన్లు, 

 

ఉప్పు - రుచికి తగినంత, 

 

నువ్వులు - రెండు టీ స్పూన్, 

 

కొబ్బరి తురుము - రెండు టీ స్పూన్, 

 

వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, 

 

జీలకర్ర - ఒక టీ స్పూన్‌, 

 

కారం - రెండు టీ స్పూన్లు.

 

తయారీ విధానం..  

 

బీన్స్‌ శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసి పెట్టుకోవాలి. పాన్‌లో నువ్వులు, జీలకర్ర, కొబ్బరి తురుము వేసి బాగా వేగించి మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకోవాలి. అదే పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, కరివేపాకు వేసి వేగించాలి. తరువాత కట్‌ చేసి పెట్టుకున్న బీన్స్‌, పసుపు వేసి కలుపుకోవాలి. చిన్న మంటపై పదినిమిషాల పాటు వేగించాలి. ఇప్పుడు పొడి చేసి పెట్టుకున్న మసాల వేయాలి. తగినంత ఉప్పు వేసి, మరికాసేపు ఉడికించుకుని దింపుకోవాలి. అంతే రుచికరమైన బీన్స్ కర్రీ రెడీ. ఈ కర్రీ చెపాతీలలోకి చాలా రుచిగా ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: