మాతృత్వం ఆడజన్మకు ఓ వరం వంటిది. మహిళలు ఆరోగ్యం విషయంలో ఎంతో కేర్ తీసుకోవాలి. ముఖ్యంగా గర్భ సమయంలో మరింత ఎక్కువ శ్రద్ధ అవసరం. అలాగే గర్భవతిని అయ్యానని తెలిసిన వెంటనే ఆమె సంతోషం, ఆనందం ముందు అన్నీ దిగతుడుపుగానే ఉంటాయి. ఆ క్షణం నుంచీ ఆమె భర్త, అత్తింటివారు, పుట్టింటివారు ఆమెను ఎంతో అపురూపంగా చూసుకుంటారు. ఆరోగ్యపరంగా కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.  అయితే సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో మీకు చాలా మంది చాలా సలహాలు ఇస్తారు. వాటిలో కొన్ని నిజం ఉంటాయి కొన్ని అబద్ధాలు ఉంటాయి.

 

ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. ప్రెగ్నెన్సీ సమయంలో మీరు చేసే పనులను బట్టి బిడ్డ గురించి కొన్ని విషయాలు చెప్పవచ్చు. అందులో ముందుగా ప్రెగ్నెన్సీ కలిగిన మహిళలు ఎక్కువగా ఒత్తిడికి లోనైతే వారికి పుట్టబోయే బిడ్డ కూడా ఒత్తిడికి లోనై సరైన పెరుగుదల ఉండదు. కాబ‌ట్టి వీలైనంత వ‌ర‌కు ఒత్తిడికి గురికాకుండా చూసుకోండి. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏ ఆహారాన్ని ఇష్టంగా తింటారో మీ పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత అదే ఆహారాన్ని ఇష్టంగా తింటారు.

 

సో.. హారపు అలవాట్లను తెలివిగా ఎంచుకోవడం ద్వారా మీ పిల్లలకు మంచిది అవుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఎవరైతే ఎక్కువ జుట్టును కోల్పోతారో వారికి పుట్టబోయే బిడ్డ ఎక్కువ జుట్టుతో పుడుతుంది. కాబట్టి మీకు జుట్టు రాలుతోందని బాధపడకండి ఎందుకంటే అది తిరిగి మీ బిడ్డకే వస్తుంది. అదేవిధంగా, ప్రెగ్నెన్సీ సమయంలో మీరు అంత్యక్రియలకు మరియు రోగులకు దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ వాటిని ఫేస్ చేస్తే మీకు తెలియకుండానే అది మీ బిడ్డ‌పై ప‌డుతుంది. కాబ‌ట్టి ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఎంత జాగ్ర‌త్త‌గా ఉంటే అంత మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: