సాధార‌ణంగా ఓ మ‌హిళ తాను త‌ల్లి కాబోతున్నాను అని తెలిసిన వెంట‌నే వ‌చ్చే ఆనందం ఆమెకు మాత్ర‌తే తెలుస్తుంది. ఎందుకంటే.. గర్భం పొందడంలో, బిడ్డకు జన్మనివ్వడంలో మ‌రియు అమ్మ అనిపించుకోవడంలో ఉన్న మాధుర్యం మాటల్లో చెప్పలేది. అదే క‌వ‌ల పిల్ల‌లు పుడితే.. ఆ ఇంట్లో ఉండే సంద‌డి అంతా.. ఇంతా కాదు. ఇంట్లో కవలలు పుట్టడం,కుటుంబానికి అదృష్టం అని కూడా చాలా మంది భావిస్తారు. అయితే క‌వ‌ల‌లు గ‌ర్భంలో ఉన్న‌ప్పుడు కొన్ని స‌మ‌స్య‌లు ఎదుర‌వుతూ ఉంటాయి.

 

అందులో ముఖ్యంగా.. గర్భస్రావం జరిగే ప్రమాదం తరచుగా కవలలలో ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితి జరగకుండా శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. ప్రెగ్నన్సీ సమయంలో సాధారణంగా అలసట ఉండటం సహజమే కానీ గర్భంలో ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు కాస్త ఎక్కువ అలసట ఉంటుంది. ఎంత శక్తివంతమైన ఆహారం తీసుకున్నా త్వరగా నీరసం వచ్చి అలసిపోతుంటారు. ఈ విష‌యంలో కూడా చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి.

 

అదేవిధంగా, గర్భంలో క‌వ‌ల పిల్ల‌లు ఉంటే పుట్టుకతో వచ్చే అసాధారణతల ప్రమాదాన్ని పెంచే అవకాశాలు ఎక్కవ. వాటిలో సాధారణంగా కనిపించే లోపాలు గుండె అసాధారణతలు, న్యూరల్ ట్యూబ్ లోపాలు మరియు జీర్ణశయాంతర రుగ్మతలు ఉంటాయి. మ‌రియు గ‌ర్భంలో క‌వ‌ల పిల్ల‌లు ఉన్న‌ప్పుడు చాలామంది డెలివరీ డేట్ కు ముందే ప్రసవించే అవకాశం ఉంది. మ‌రోవిష‌యం ఏంటంటే.. ఒక్కోసారి 37 వారాలకు ముందే ప్రసవించే ప్రమాదం కూడా ఉంటుంది. కాబ‌ట్టి గ‌ర్భంలో డాక్ట‌ర్ స‌ల‌హాల మేర‌కు త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాలి.
  

మరింత సమాచారం తెలుసుకోండి: