అయితే గర్భధారణ సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి సురక్షితమైన, సున్నితమైన మార్గంగా యోగా నిర్ధారించబడింది. ఈ సమయంలో మీరు యోగా చేస్తే బిడ్డకు ఆరోగ్యం చేకూరుతుంది. ప్రినేటల్ యోగాను అభ్యసించడం ద్వారా శిశువు బరువు మెరుగవ్వడం, ముందస్తు ప్రసవ ప్రమాదం తగ్గుతుంది. ఇది గర్భధారణ సమయంలో వచ్చే అధిక రక్తపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ర్భధారణ సమయంలో స్త్రీలకు వెన్నునొప్పి, వికారం, నిద్రలేమి, తలనొప్పి వంటి అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడంలో ప్రినేటల్ యోగా సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇక డెలివరీ సమయంలో మహిళలు ఒత్తిడికి లోనవుతుంటారు. ముఖ్యంగా మొదటిసారి జన్మనిచ్చే మహిళలకు ఇది సాధారణ సమస్య అని చెప్పవచ్చు. అందువల్ల, వివిధ ఆసనాలతో తల్లిని శారీరకంగా, మానసికంగా ప్రసవానికి సిద్ధం చేయవచ్చు. ప్రినేటల్ యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల కాళ్ళు మరింత బలోపేతం అవుతాయి, తద్వారా ప్రసవ సమయంలో వివిధ బంగిమల్లో కూర్చోవడం కూడా సులువవుతుంది. అంతేకాక, ప్రసవ సమయంలో నొప్పి తగ్గుతుంది. గర్భిణీ స్త్రీ శరీర కండరాలు, లిగ్మెంట్స్ను సాగదీయడానికి యోగా సహాయపడుతుంది. తద్వారా పెరుగుతున్న శిశువుకు గర్భంలో స్థలం లభిస్తుంది. శిశువు పెరుగుతున్నప్పుడు లేదా గర్భంలో శిశువు విస్తరించే సమయంలో కాళ్ళలో వచ్చే నొప్పి నుండి ఉపశమనానికి యోగా సహాయపడుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి