బరువు సమస్య లింగ భేదం లేకుండా అందరినీ పట్టి పీడిస్తుంది. అయితే దీని గురించి ఎక్కువ ఆందోళన చెందేది మాత్రం మహిళలే. యోగా, వెయిట్ లాస్ ట్రీట్‌మెంట్లు ఇలా ఏది కనిపిస్తే అది వాడేసి బరువు తగ్గాలని చాలా మంది మహిళలు ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా గృహిణుల్లో ఈ భయం చాలా ఎక్కువ. అధిక బరువు చిన్న సమస్య ఏమీ కాదు. దీన్ని సీరియస్ గా తీసుకోక పోతే చాలా ప్రమాదం. గుండె సమస్యలు, డయాబెటీస్ కు కారణం అవుతుంది. అందుకే దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని వైద్యులు కూడా చెప్తుంటారు.

బరువు తగ్గడం కోసం యోగా క్లాసులు, జిమ్ముల వైపు యువత చూపు ఉంటుంది. అలాగే డైట్ ప్లాన్లు, ఆహారంపై నియంత్రణ కూడా దీనికి చాలా ముఖ్యమని నిపుణులు సూచనలు ఇస్తున్నారు. కేలరీలు మాత్రమే చూసుకోకుండా అన్ని రకాలుగా శరీరానికి ఉపయోగ పడే ఆహారం తీసుకోవాలని వారి సలహా. అదే సమయంలో ఎక్సర్ సైజులు, వాకింగ్, జాగింగ్, స్ట్రెచెస్ వంటివి కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగం.

ప్రస్తుత బిజీ ప్రపంచంలో మనకు ఏం చేయాలన్నా టైం దొరకడం కష్టం. ఎక్కువగా ఒక చోట కూర్చుని చేసే ఉద్యోగాలే. ఈ క్రమంలో కదలకుండా ఒక చోట కూర్చొని కూడా కొంత బరువు తగ్గడం సాధ్యమే అని కొందరు చెప్తున్నారు. దీని కోసం కొన్ని చిట్కాలు చెప్తున్నారు. మరి మనం కూడా వాటిపై ఓ లుక్కేద్దామా?

1. బబుల్ గమ్ తినడం వల్ల 10 కేలరీలు ఖర్చు అవుతాయట. అలాగే ఇది తినడం వల్ల ఆకలి కూడా అవ్వదు.
2. సాధ్యమైనంతగా నీళ్లు తాగడం వల్ల కూడా బరువు తగ్గే అవకాశం ఉంది.
3. కూర్చొని కూడా చేయగలిగే ఎక్సర్ సైజులపై దృష్టి పెడితే మంచిది.
4. చుట్టు పక్కల వారితో సరదాగా మాట్లాడటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే కేలరీలు కూడా ఖర్చు అవుతాయి.
5. అరగంటకు ఓసారి లేచి కొంత దూరం నడవడం కూడా ఉత్తమం. దీని వల్ల మెటబాలిజం మెరుగవుతుంది.
6. జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. తాజా పండ్లు, ఆకుకూరలు వంటివి తీసుకోవాలి.
7. బ్రీతింగ్ టెక్నిక్స్ నేర్చుకొని అవి చేస్తూ ఉండాలి.
8. హ్యాండ్ గ్రిప్పర్స్, ఫింగర్ ట్విస్టర్స్ వంటివి క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి.

వీటితోనే బరువు తగ్గిపోతామని కాదు కానీ, అసలేమీ చేయకుండా ఉండటం కన్నా ఇవి చేయడం మంచిది. కుదిరితే కొన్ని ఎక్సర్ సైజులను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడం ఉత్తమం. దీని వల్ల శరీరమే కాదు, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: