గర్భధారణ సమయంలో ఎన్ని సమస్యలు ఎదుర్కొన్న, ప్రసవం తర్వాత బిడ్డను చూసి అన్ని మర్చిపోతారు. అయితే ఈ రోజు ల్లో శరీరాన్ని తిరిగి మాములు గా  మార్చుకోవడానికి  చాలాపద్ధతులు ఉన్నాయి. అందులో బెల్లి బెల్ట్ ఒక్కటి. అయితే బెల్లి బెల్ట్ యొక్కముఖ్యమైన ప్రయోజనము ప్రసవం తర్వాత శరీరం యొక్క ఆకృతిని అందముగా మార్చుకోవడం. ప్రసవం తరువాత నడుం భాగం బాగా వెడల్పుగా తయారవుతుంది. ఈ బెల్ట్ వాడటం వలన చాల తేలికగా అతి కొద్దీ సమయంలో మీ పూర్వ శారీరక ఆకృతిని తిరిగి పొందగలుగుతారు.

అయితే బెల్లి బెల్ట్ వాడటానికి ముఖ్య కారణం ఏమిటంటే అది శరీర పటుత్వం పెరిగేలా చేస్తుంది. దీనిని  వాడటం కూడా చాలా తేలిక . పిల్లలను చూసుకుంటూ మన శరీరం మీద శ్రద్ద పెట్టడం అంతతేలికైన  విషయం కాదు. కానీ, బెల్లి బెల్ట్ వాడడం వలన శరీరం తిరిగి మాములు ఆకృతికి వస్తుంది. ప్రసవం తర్వాత తరువాత వెన్ను నొప్పి రావడం అనేది  చాలా సహజం గా జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం మన శరీరం యొక్క ఆకృతి లో మార్పు రావడం. బెల్లి బెల్ట్ వలన ఆకృతి సరిఅవడం తో పాటు వెన్ను నొప్పి నుండి కూడా ఉపశమనం కలుగుతుంది.

అంతేకాదు సిసేరియన్ జరిగిన స్త్రీలకు  ఆపరేషన్ జరగడం వలన కలిగే నొప్పి తగ్గడం కోసం కూడా డాక్టర్లు బెల్లి బెల్ట్ వేసుకోమని సూచిస్తుంటారు.దానితో పాటుగా కుట్లు తొందరగామానేందుకు కూడా కారణం అవుతుంది. ఈ  బెల్ట్  పెట్టుకోవడం వలన గాయానికి ఇన్ఫెక్షన్, దెబ్బలు వంటివి కలగకుండా రక్షణ ని ఇస్తుంది. ఈ బెల్ట్  వేసుకోవడానికి సులువుగా ఉండడం తో పాటు కావాల్సిన కొలతల్లో దొరకడం వలన కూడా దీనిని చాల  మంది వాడటానికి ఆశక్తి చూపుతున్నారు. ఇక్కడ గమనించవలిసిన విషయం ఏమిటంటే మీరు ఈ బెల్ట్ వాడే ముందు ఒక్కసారి డాక్టర్ దగ్గర సలహా తీసుకోవడం అన్నివిధాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: