కావలసిన పదార్థాలు: అట్లపిండి : అర కిలో ఉల్లిగడ్డ : ఒకటి పెద్దది జీలకర్ర : రెండు చెంచెలు కొత్తిమీర : తరిగినది చాలినంత ఉప్పు : తగినంత నూనె : సరిపడా పచ్చి మిర్చి : ఆరు నీళ్లు : పిండి తడుపుకోవడానికి చాలినన్ని తయారు చేసే పద్ధతి: ముందుగా ఉల్లిగడ్డ, పచ్చి మిర్చి, జీలకర్ర గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక పాత్రలో పిండి పోసుకొని దానిలో నూరి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి నీళ్లు పోసి పలుచగా తడుపుకోవాలి. అందులో కొత్తిమీర, ఉప్పు వేసుకొని గరిటె జారుడుగా కలుపుకోవాలి. స్టవ్‌పై పెనం పెట్టి వేడయ్యాక కొద్దిగా నూనె రాసి అట్లు పోయాలి. వీటిని చింతపండు పచ్చడితో కలుపుకొని తింటే రుచిగా ఉంటవి.  

మరింత సమాచారం తెలుసుకోండి: