కావలసిన పధార్థాలు :  మటన్ : కిలో బాస్మతి బియ్యం : అరకిలో, ఉల్లిపాయలు : రెండు అల్లంవెల్లుల్లి : 50 గ్రా.లు కారం : టీస్పూను పెరుగు : కప్పు మీగడ: 50 గ్రా.లు లవంగాలు : 5, యాలకులు : 5 బాదం పప్పు : 50 గ్రా.లు దాల్చినచెక్క : 2 అంగుళాలుముక్క ఉప్పు: తగినంత కుంకుమ పువ్వు : టీ స్పూను రోజ్ వాటర్ : టీస్పూను తయారీ చేసే విధానం : మటన్ ముక్కల్ని శుభ్రంగా కడగాలి. ఉల్లిముక్కల్ని సన్నగా తరగాలి. అల్లం వెల్లుల్లి మెత్తగా రుబ్బి రసం మాత్రం తీసి పిప్పి తీసేయాలి. యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క కలిపి మిక్సీలో వేసి పొడి చేయాలి. బియ్యం కడిగి ఓ గంట సేపు నాననివ్వాలి. మందపాటి బాణలి తీసుకుని సగం నెయ్యి వేసి ఉల్లిముక్కలు వేసి వేయించాలి తరవాత వాటిని తీసి పక్కన ఉంచి మిగిలిన నెయ్యిలో బాదంముక్కలు, మటన్ ముక్కలు, అల్లంవెల్లుల్లి రసం, కారం, ఉప్పు, మసాలాపొడి, పెరుగు వేసి కలపాలి. మటన్ ముక్కలు కాస్త వేగాయి అనుకున్న తరవాత 4 కప్పులు నీళ్లు పోసి తక్కువ మంట మీద ఉడికించాలి. ముక్కలు మెత్తగా ఉడికిన తరవాత దించి మటన్ లో రిన నీటి వంపి విడిగా ఉంచాలి. ఇపుడు పాన్ కి కాస్త నెయ్యి రాసి మటన్ ముక్కలు వేసి ఎర్రగా వేయించి ఉంచాలి. మిగిలిన నెయ్యి కూడా పాన్ లో కడిగి ఉంచిన బియ్యం వేసి మీడియం మంటమీద ఐదారు నిమిషాలు వేయించాలి. తరవాత సగం బియ్యం మటన్ ముక్కల్ని పరిచి వాటి మీద మిగిలిన బియ్యం వేయాలి. కుంకుమపువ్వును రోజ్ వాటర్ లో కలిపి ఆ నీటిని బియ్యం మీద చల్లాలి. తరువాత మటన్ నుంచి వంపి వుంచిన నీటిని కూడా పోసి మూతపెట్టి 30 నిమిషాలు సిమ్ లో దమ్ చేయాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: