సాధారణంగా పోలీస్ వృత్తి అంటే ఎలా ఉంటుందో మనకి తెలుసు ఎప్పుడు వెళ్తామో, ఎప్పటికి వస్తామో తెలియని ఉద్యోగం. ఒక్కోసారి ఎన్నో నిద్రలు లేని రాత్రుళ్ళు కూడా ఉద్యోగం చేయవలసి వస్తుంది. ఈ ఉద్యోగంతోనే బిజీగా ఉండే వాళ్ళు ఇక వేరే పనులు చేయడానికి ఏమి ఉండదు కానీ వరంగల్ కి చెందిన ఈ మహిళా ఒక పక్క పోలీస్ కానిస్టేబుల్ గా చేస్తూనే మరోపక్క పాల డెయిరీ ని నిర్వహిస్తుంది. మరి ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందామా.
వరంగల్ కి చెందిన స్వప్న 2014 లో కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపిక అయ్యింది.ప్రస్తుతం ఇక్కడి మహిళా పోలీస్ స్టేషన్ లో పని చేస్తోంది. స్వప్న తమ ఇంట్లో పదికి పైగా పాడిగేదెలను పెంచుతున్నారు. అయితే స్వప్న తన డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చాక పాడిగేదెల ఆలనాపాలనా చూసేది. పాలు పితకడం, గేదెలకు మేత వేయడం లాంటి అన్ని పనులను స్వప్న దగ్గరుండి మరి చేస్తుంది. తన భర్తకు పాల డెయిరీ నిర్వహణలో భాగంగా ఈ రకంగా సహాయంగా ఉంటోంది. ఈ వన్నీ పనులు చేస్తూనే వంట చేయడం,ఇంటిని తన ఇద్దరి పిల్లలను చూసుకోవడం మళ్ళీ ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్లడం. వీటన్నింటిని స్వప్న తన ఒంటి చేత్తో విజయవంతంగా నడిపిస్తుంది.
కష్టమైన పోలీస్ ఉద్యోగం చేస్తూ, మరోపక్క పాల డెయిరీ నిర్వహణలో భర్తకి చేదోడువాదోడుగా ఉంటున్న స్వప్న ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది. ఈ రోజుల్లో పోలీస్ ఉద్యోగమైనా మరేదైనా ప్రజలు అలసిపోతున్నారు. వాళ్ళు చేసే ఉద్యోగంతోనే రాత్రి వచ్చేస్తుంది. ఇక వాళ్ళు వేరేది చేయడానికి సమయం ఉండటం లేదు. ఒక మహిళా అయి ఉండి కూడా స్వప్న ఇలా రెండు విధాలుగా పాత్రలు పోషిస్తూ తన కుటుంబ ఆభివృద్ధికి పాటుపడుతుంది. స్వప్నలాగా సమాజంలోని మహిళలు ఆలోచిస్తే వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు అత్యున్నత స్థాయికి మాత్రం వెళ్ళగలరు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి