గర్భధారణ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. వారు తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. ఇక గర్భధారణ సమయంలో స్త్రీలకు ఐరన్ కూడా చాలా ముఖ్యం. అయితే ఐరన్ ని మీ డైట్ లో ఎలా తీసుకోవచ్చు అనేది చూస్తే... మనకి ఐరన్ ఆకుకూరలు నుంచి ఎక్కువగా లభిస్తుంది. అంతేకాక.. జంతువుల నుండి గింజలు నుండి కూడా ఇది మనకి దొరుకుతుంది. అయితే ఆహారం తీసుకునేటప్పుడు ఫోలేట్ కూడా ఉండేటట్టు చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలిపారు.

గర్భిణులు ఆకు కూరలు, టోఫు, తక్కువ కొవ్వు ఉండే పాలు, పాల పదార్థాలలో కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. అంతేకాక.. గర్భధారణ సమయంలో క్యాల్షియం ఉండే ఆహార పదార్థాలు స్త్రీలు తప్పక తీసుకోవాలని చెప్పారు. ఇక వీటి వల్ల చక్కటి ప్రయోజనాలు పొందవచ్చునని అన్నారు. అంతేకాదు.. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి వాల్ నట్స్, ఫ్లేక్ సీడ్స్, చేపల ద్వారా సమృద్ధిగా లభిస్తుంది. అందుకే వీటిని కూడా గర్భధారణ సమయంలో తీసుకోవడం చాలా ముఖ్యం అని చెబుతున్నారు. .

ఇక ఇప్పటి వరకు మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలో ఒక్కసారి చూద్దామా. ఇక వీటికి దూరంగా ఉండడం చాలా అవసరం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక గర్భధారణ సమయంలో వీటి జోలికి అస్సలు వెళ్ళద్దుని అంటున్నారు. గర్భధారణ సమయంలో రిఫైన్డ్ చేసిన పిండి తీసుకోకూడదు. అంతేకాదు.. ప్రొసెస్డ్, ప్యాకేజ్డ్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. అలాగే ధూమపానం, మద్యపానం దూరంగా ఉండాలి.

గర్భదారణ సమయంలో గర్భిణులు రోజుకు 300 గ్రాముల కంటే ఎక్కువ కెఫిన్ తీసుకోవాలి చెప్పారు. అంతేకాక ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ దూరంగా ఉండాలి. ఇక గర్భిణులు పచ్చి గుడ్లు, పచ్చి సీ ఫుడ్ దూరంగా ఉండాలి. అలాగే ఆహారం ఒకేసారి ఎక్కువగా తినకూడదు. ఇక
ఎక్కువ ఫ్లేవర్ ఉన్న ఆహారం తీసుకోవడం, ఎలర్జీ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం లాంటివి చేయకూడదు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: