సాధారణంగా గర్భధారణనికి ప్లానింగ్ అనేది చాలా అవసరం. ప్రెగ్నెసీ సమయంలో చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇక వీటి కోసం ముందే ప్లానింగ్ అనేది ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే తప్పకుండా తల్లి అవ్వాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం మొదట ఫాలో అవ్వాలని చెబుతున్నారు.

అయితే గర్భిణీ దాల్చిన తరువాత చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని చెప్పారు. వాస్తవానికి గర్భధారణ సమయంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాలి. ఇక  ప్రెగ్నెంట్ అయిన తర్వాత వెంటనే చేయాల్సిన కొన్ని వాటిని ఇప్పుడు ఒక్కసారి చూద్దామా.

ఇక గర్భం దాల్చిన వెంటనే దానిని కాస్త రహస్యంగా ఉంచాలి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవద్దు. మీరు గర్భం దాల్చిన విషయాన్ని మొదట మీ భర్తకు తెలియజేయండి. ఆ తరువాత మీకు దగ్గరలో ఉండే గైనికాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి. అయితే మొదట కన్సల్ట్ చేసి మీకు కావలసిన సమాధానాలు అన్నిటినీ అడుగేయాలని సూచించారు. ఎటువంటి ఆలోచనలు లేకుండా మీకు వున్నా డౌట్స్ ని క్లియర్ చేసుకోవాలని చెబుతున్నారు.

అంతేకాదు.. గర్భిణులు ధూమపానం మద్యపానం అలవాటు ఉంటే వాటిని మానేయాలని చెబుతున్నారు. వాటి వలన కడుపులో ఉండే బిడ్డకు ఎఫెక్ట్ అవుతుందని చెబుతున్నారు. ఇక చెడు అలవాట్లు ఉంటే వాటిని మొదట మానేయాలని చెబుతున్నారు. కాగా.. గర్భిణీ అయితే తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. వాస్తవానికి మీరు తీసుకునే ఆహారం చాలా అవసరం అని గుర్తించుకోవాలి. ఇక సురక్షితమైన, ఆరోగ్యమైన ప్రెగ్నెన్సీకి దారి తీస్తుందని చెబుతున్నారు. అంతేకాక.. కూరగాయలు, ఆకు కూరలు , నట్స్, గింజలు, పండ్లు మొదలైన ఆహార పదార్థాలు వల్ల ఆరోగ్యం మంచిగా ఉంటుందని తెలిపారు. గర్భిణులు వీలైనంత వరకు వీటిని ఆహారంగా తీసుకుంటే  బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: