మన దేశంలో ఎంతో మంది మహిళ రాజకీయ నేతలు ఉన్నారు. వారిలోమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ అద్భుతమైన స్థానంలో ఉంటుంది. ప్రస్తుతం మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గా కొనసాగుతుంది. మరిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది. ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎలా చేరుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.

మమతా బెనర్జీ రాజకీయ ప్రస్థానం 1984 వ సంవత్సరం మొదలయ్యింది.  జాదవ్‌పూర్ నియోజక వర్గంలో సోమనాధ ఛటర్జీ తో పోటీ చేయటానికి పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు వెనకడుగు వేసిన కాలమది. సోమనాఢ ఛటర్జీ కి జాదవ్‌పూర్ నియోజక వర్గం కంచుకోట. చిచ్చర పిడుగు మమతా బెనర్జీ ఇంటింటికీ వెళ్ళి పేద సాదలతో ముచ్చటించి వారితో పాటే తేనీరు సేవించి వారిని కౌగిలించుకుని నేనూ మీలో ఒక మనిషినని. మీరు పంపితే నేను లోక్‌సభ వెళ్లగలను అని ప్రజలతో పాలు నీళ్ళలా కలిసిపోయింది. అటువంటి ప్రచారాన్ని అట్టడుగు ప్రజలకు చేర్చి సోమనాధ ఛటర్జీని మట్టి కరిపించింది. 1984 లో వామపక్షాల దిమ్మ తిరిగిపోయింది. అప్పటి నుంచి మమతా బెనర్జీకి ఫైర్ బ్రాండ్ అనే పేరు స్థిరపడింది. ఇక అప్పటి నుండి ఈమె రాజకీయాల్లో ఎప్పుడూ వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఒక్కో అడుగు వేసుకుంటూ రాజకీయలలో అద్భుతమైన స్థాయికి చేరుకుంది.

ఇకపోతేమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి గా 2021 మే 5 న ప్రమాణ స్వీకారం చేసింది. గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కడ్‌ ఆమెచేత ప్రమాణ స్వీకార చేయించాడు. మమతా బెనర్జీ వరుసగా మూడో సారి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి గా భాద్యతలు చేపట్టింది. ఇలా మమత బెనర్జీ రాజకీయాల్లో చిన్న స్థాయి నుండి మొదలు పెట్టి ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి స్థాయికి ఎదగడం మాత్రమే కాకుండా వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రి గా ఎన్నికయి మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధ్యం అనే దానికి ఆదర్శంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: