జర్మన్ లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ ఇండియా.. తమ హెరిటేజ్ లైనప్ మోడళ్ల నుంచి ఆర్18 క్రూయిజర్ మోటార్‌సైకిల్ ‌ను భారత మార్కెట్లో విడుదల సిద్ధం అవుతుంది. అంతేకాకుండా ఈ కంపెనీ ఓ టీజర్‌ను కూడా విడుదల చేసినట్లు తెలియజేసింది. అంతేకాకుండా బిఎమ్‌డబ్ల్యూ ఆర్18 క్రూయిజర్ గతంలోని ఐకానిక్ ఆర్5 మోడల్ నుండి ప్రేరణ పొంది, రెట్రో-డిజైన్‌ను కలిగి ఉంటుందని నిపుణులు తెలిపారు. బిఎమ్‌డబ్ల్యూ ఆర్18 మోటార్‌సైకిల్‌ను కంపెనీ సెప్టెంబర్ 19, 2020వ తేదీన మార్కెట్లో విడుదల చేయనుంది.

ఇక మోటారుసైకిల్ 2440 మిమీ పొడవు, 1232 మిమీ ఎత్తు 964 మిమీ వెడల్పుతో పాటు 1630 మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుందన్నారు. దీని రైడర్ సీటు ఎత్తు 690 మిమీ వద్ద సెట్ చేయబడిందన్నారు. దీని మొత్తం బరువు 215 కిలోలుగా ఉంటుందన్నారు. బిఎమ్‌డబ్ల్యూ ఆర్18 అనేక ఫీచర్లు ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెడ్ పరికరాలతో లోడ్ చేయబడి ఉంటుందన్నారు. ఈ క్రూయిజర్ మోటార్‌సైకిల్‌లో మూడు రైడింగ్ మోడ్‌లు, ఆటోమేటిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, మోటారు స్లిప్ రెగ్యులేషన్ మొదలైన అధునాతన ఫీచర్లు ఉన్నాయని తెలిపారు.

అయితే ఇందులోని సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు వెనుక భాగంలో సెంట్రల్ షాక్ స్ట్రట్ సెటప్ ఉంటుంది. అలాగే, బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో రెండు 300 మిమీ డిస్క్‌లు వెనుకవైపు ఒకే ఒక 300 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటాయి. బిఎమ్‌డబ్ల్యూ ఆర్18 ముందు వైపు 19 ఇంచ్ వెనుక వైపు 16 ఇంచ్ స్పోక్డ్ వీల్స్‌ను కలిగి ఉంటుందని నిపుణులు తెలిపారు.

ఇక బిఎమ్‌డబ్ల్యూ ఆర్18 ఒక గొప్ప పెర్ఫార్మెన్స్ క్రూయిజర్ మోటార్‌సైకిల్. సరదాగా వారాంతాల్లో నడిపేందుకు ఇదొక విలాసవంతమైన బైక్. సుదూర ప్రయాణాలకు సహకరించేందుకు ఇందులో పలు ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే, ఇది మంచి రిలాక్స్డ్ అండ్ లే-బ్యాక్ రైడింగ్ పొజిషన్‌ను కలిగి ఉంటుంది. మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ ఆర్18 ధరలు రూ .18 లక్షల నుండి రూ.25 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండొచ్చని అంచనా వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: