ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలు కొత్త వాహనాలను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.. కొన్ని యువత ఆలోచనకు సూట్ అవుతున్నాయి..మరి కొన్ని ఏదో అలా సేల్ అవుతున్నాయి. ఫీచర్లు బాగుంటే ఎంత ధర పెట్టడానికైన కొందరు వెనకాడరు..అలాంటి రిచ్ బైక్ లలో ఒకటి బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్..తాజాగా బీఎండబ్లూ సంస్థ నుంచి సరికొత్త మోటార్ సైకిల్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. అదే బీఎండబ్ల్యూ ఎం 1000ఆర్ఆర్ బైక్. భారత్ లో విడుదలైన తొలి ఎం సిరీస్ మోడల్ ఇదే. స్టాండర్డ్, కాంపిటీషన్ అనే రెండు వేరియంట్లలో ఇది లభ్యమవుతుంది.


ఎక్స్ షోరూంలో బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్ ప్రారంభ ధర వచ్చేసి రూ.42 లక్షలు(స్టాండార్డ్ వేరియంట్). టాప్ స్పెక్ అయిన కాంపిటీషన్ వేరియంట్ రూ.45 లక్షలుగా సంస్థ నిర్దేశించింది. ఇప్పటికే ఈ బైక్స్ కు సంబంధిచిన బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఇండియా డీలర్ల వద్ద ఇవి అందుబాటులో ఉన్నాయి.బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్ 999సీసీ ఇన్ లైన్ ఇంజిన్ ను కలిగి ఉంది. అంతేకాకుండా వేరియబుల్ వాల్వ్ టైమింగ్ తో షిఫ్ట్ కాం టెక్నాలజీని ఇందులో పొందుపరిచారు. 2-రింగ్ ఫోర్జెడ్ పిస్టన్స్, టైటానియం కనెక్టింగ్ రాడ్స్, లైటర్ రాకర్ ఆర్మ్స్ వంటి ప్రత్యేకతలు ఈ స్కూటర్ లో ఉన్నాయి.


ఇకపోతే ఈ బండి స్పీడ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.. బైక్ 6-స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది. అంతేకాకుండా స్లిప్ అసిస్ట్ క్లచ్, బైడైరెక్షనల్ క్విక్ షిఫ్టర్, క్వికర్ డౌన్ షిఫ్టర్ తో అందుబాటులో వచ్చింది. 45 ఎంఎం సస్పెన్షన్ సెటప్ ఫ్రంట్ యూఎస్డీ ఫోర్కులు, రియర్ మోనోషాక్ అబ్జార్బర్లను ఇందులో ఉన్నాయి... కాస్ట్ తో పాటుగా మంచి ఫీచర్లు కూడా ఈ బైకు కు ఉన్నాయి. దీంతో లగ్జరీ బైక్ కొనాలనుకునే వాళ్ళు దీనిని ఇష్టపడుతున్నారు. దీంతో మార్కెట్ లో వీటికి క్రేజ్ కూడా ఎక్కువగా ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: