ఇక హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే విక్రయిస్తున్న తన 'సిబి300ఎఫ్' (CB300F) బైక్ కొనులుపై ఇప్పుడు భారీ డిస్కౌంట్ ఆఫర్ ని తీసుకువచ్చింది.ఇక హోండా కంపెనీ ఈ 2022 చివరి నెలలో కూడా మంచి అమ్మకాలను పొందటానికి ఇప్పుడు CB300F పై మొత్తం రూ. 50,000 తగ్గింపును ప్రకటించింది. అందువల్ల CB300F కొనాలనుకునే కస్టమర్లు ఇప్పుడు రూ. 50,000 తగ్గింపుతో ఈ బైక్ ని సొంతం చేసుకోవచ్చు. ఈ డిస్కౌంట్ కేవలం పరిమిత కాలం దాకా మాత్రమే అందుబాటులో ఉంటుంది. కంపెనీ  ప్రీమియం బిగ్‌వింగ్ డీలర్‌షిప్ ద్వారా ఈ బైక్ ని కొనుగోలు చేయవచ్చు.ఇక హోండా మోటార్‌సైకిల్ కంపెనీ గత ఆగష్టు నెలలో హోండా CB300F బైకుని రెండు వేరియంట్స్ లో రిలీజ్ చేసింది. అవి డీలక్స్ ఇంకా డీలక్స్ ప్రో వేరియంట్లు. విడుదల సమయంలో ఈ రెండు వేరియంట్ల ధరలు వరుసగా రూ. 2,25,900  ఇంకా రూ. 2,28,900 (ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉండేవి. అయితే కంపెనీ అందిస్తున్న ఈ డిస్కౌంట్ తో ఈ రెండు వేరియంట్లు రూ. 1,75,900 ఇంకా రూ. 1,78,000 కి చేరాయి.


కంపెనీ అందించిన ఈ అద్బుతమైన ఆఫర్ వల్ల 'హోండా CB300F' KTM డ్యూక్ 125 బైక్ కంటే కూడా సరసమైనదిగా మారిపోయింది. ఇండియన్ మార్కెట్లో KTM డ్యూక్ 125 ధర రూ. 1.78 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇక CB300F ఇప్పుడు ధర వద్ద బజాజ్ డామినార్ (రూ. 1.75 లక్షలు) బైక్ కి కూడా సమానంగా ఉంది. ప్రస్తుతం CB300F స్టాక్ ఉన్నంత దాకా మాత్రమే ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది.ఇక ఈ బైక్ మంచి డిజైన్ ఇంకా ఫీచర్స్ కలిగి అగ్రెసివ్ లుక్ ని పొందుతుంది. ఈ కొత్త బైక్ పొడవు 2,084 మిమీ, వెడల్పు 765 మిమీ, ఎత్తు 1,075 మిమీ ఇంకా వీల్‌బేస్ 1,390 మిమీ దాకా ఉంటుంది.హోండా CB300F లో మజిక్యులర్ ఫ్యూయెల్ ట్యాంక్, షార్ప్ ట్యాంక్ ఎక్స్‌టెన్షన్స్, స్ప్లిట్ సీట్ ఇంకా అలాగే వెనుక భాగంలో ఎత్తుగా ఉండే టెయిల్ సెక్షన్, పొట్టిగా ఉండే చబ్బీ సైలెన్స్, గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఉండే ఇంజన్, బాడీ కలర్ ఫ్రంట్ మడ్‌గార్డ్, సన్నటి టర్న్ ఇండికేటర్లు ఇంకా అలాగే యాంగ్యులర్ హెడ్‌ల్యాంప్, స్ప్లిట్ గ్రాబ్ రెయిల్, ఇంజన్ కేసింగ్, హాఫ్ చైన్ ఫ్రేమ్ మొదలైన డిజైన్ ఎలిమెంట్స్ వున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: