ఇప్పుడు అన్ని కంపెనీలు కూడా తమ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని రిలీజ్ చేస్తున్నాయి. మార్కెట్లో ఎన్ని రకాల ఈవీ మోడల్స్ వచ్చినా కొన్ని మాత్రమే వినియోగదారుల నుంచి ఆదరణను అందుకుంటున్నాయి.అలాంటి వాటి కోవలోకి టీవీఎస్ కంపెనీ రిలీజ్ చేసిన ఐక్యూబ్ ఈవీ స్కూటర్ కూడా వస్తుంది. 2022 లో టీవీఎస్ రిలీజ్ చేసిన ఐక్యూబ్ స్కూటర్ అప్డేటెడ్ ఫీచర్లు, సరికొత్త కలర్ ఆప్షన్స్ తో వస్తున్నాయి. దీంతో చాలా మంది వినియోగదారులు కూడా ఈ స్కూటర్స్ పై ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అయితే ఈ స్కూటర్ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన వివరాలు ఇప్పడు మనం తెలుసుకుందాం.ఇక ఈ స్కూటర్  కరెంటు ద్వారా పని చేస్తుంది. ఇంకా అలాగే ముందు, వెనుక టైర్ 90/90-12 తో వస్తుంది. అలాగే బండి బరువు మొత్తం 118 కిలోలు ఉంటుంది. వెనుక డ్రమ్ బ్రేక్ తో ఈ స్కూటర్ వస్తుంది. ఇంకా అలాగే ముందుభాగంతో టెలీస్కోపిక్ సస్పెన్షన్ తో ఈ బైక్ వస్తుంది. దీన్ని ఓ సారి చార్జి చేస్తే ఏకంగా 100 కిలో మీటర్ల మైలేజ్ ను ఇస్తుంది. అలాగే 3.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో ఈ స్కూటర్ వస్తుంది.ఈ ఐక్యూబ్ ఎస్ 770mm సీట్ ఎత్తును కలిగి ఉంటుంది.


కాబట్టి దీన్ని చాలా ఈజీగా బ్యాలెన్స్ చేయవచ్చు. అలాగే విశాలమైన ఫుట్‌బోర్డ్ మీ పాదాలను చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అలాగే ఆ ఫ్లోర్‌ బోర్డ్ మీ రైడింగ్ కు అనుకూలంగా ఉంటుంది. అలాగే బ్యాక్‌ప్యాక్ కోసం తగినంత స్పేస్ కూడా మిగిలి ఉంటుంది. అలాగే ఎత్తైన హ్యాండిల్‌బార్ సౌకర్యవంతమైన సీటింగ్ ట్రయాంగిల్‌ను క్రియేట్ చేస్తుంది. అలాగే సీటు కుషనింగ్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. చాలా ఈజీగా రెండు నుంచి మూడు గంటల పాటు ఎలాంటి అలసట లేకుండా ఈ బైక్ ని నడపవచ్చు.ఇక ఈ ఈవీ స్కూటర్ ఎకో మోడ్‌లో 100 కిమీ మైలేజ్ ని ఇస్తుంది. అలాగే పవర్ మోడ్‌లో మొత్తం 75 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే ఈ స్కూటర్ గంటకు 78 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తుంది.అయితే పవర్ మోడ్ ఎక్కువ బ్యాటరీ పవర్ ని వినియోగిస్తుందని గమనించాలి. ఇక ఈ స్కూటర్ లో 3.4kWh లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. అలాగే దీన్ని చార్జ్ చేయడానికి దాదాపు 4.5 గంటల సమయం పడుతుంది. అలాగే ఈ స్కూటర్ లో మొబైల్ చార్జింగ్ పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: