ఈ రోజుల్లో టూ వీలర్ అనేది ప్రతి కుటుంబానికి చాలా అవసరంగా మారింది. పనిమీద బయటకి వెళ్లాలంటే ఖచ్చితంగా టూ వీలర్ అనేది తప్పనిసరిగా ప్రతి వ్యక్తికి ఉండాలి. టూ వీలర్ లేకుంటే ఈరోజుల్లో ఏ పని కూడా జరగదు. అయితే సాధారణంగా ఏదైనా కొత్త బైక్ ని మీరు కొనాలనుకుంటే.. కచ్చితంగా రూ. 70 వేల నుంచి రూ. లక్ష దాకా ఖచ్చితంగా ఖర్చు చేయాల్సిందే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత డబ్బుతో కొత్త బైక్ కొనే బదులుగా మధ్యతరగతి ప్రజలు సెకండ్ హ్యాండ్ బైకుల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు.అయితే అలాంటి వారికోసం అదిరిపోయే సూపర్ డీల్‌ ఒకటి ఉంది. హోండా ఎస్‌పీ 125 బైక్‌ను కేవలం రూ. 30 వేలకే మీరు ఈజీగా మీ సొంతం చేసుకోవచ్చు. ఈ బైక్ ప్రస్తుత ఎక్స్ షోరూమ్ ధర వచ్చేసి రూ. 82,486 గా ఉంది. అయితే ఫేమస్ సెకండ్ హ్యాండ్ బైక్‌లను విక్రయించే ఆన్‌లైన్ వెబ్‌సైట్లు ఈ బైక్‌ను అదిరిపోయే ఆఫర్లని పెట్టాయి.  ఆ ఆఫర్ల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం..


ఇక 2018వ సంవత్సరానికి చెందిన హోండా ఎస్‌పీ 125 బైక్ మోడల్ ఓఎల్‌ఎక్స్‌లో మొత్తం రూ. 30 వేలకు అందుబాటులో ఉంది. ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో అమ్మకానికి ఉంచిన ఈ బైక్‌కు ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంది.ఇక 2019 వ సంవత్సరానికి చెందిన హోండా ఎస్‌పీ 125 బైక్ డ్రూంమ్‌లో మొత్తం రూ. 35 వేలకు అమ్మకానికి ఉంచారు. ఇది కూడా ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో అందుబాటులో ఉండగా.. దీనికి కూడా ఫైనాన్స్ సౌకర్యం అనేది ఉంది.ఇక బైక్4సేల్ వెబ్‌సైట్‌లో 2019 వ సంవత్సరానికి చెందిన హోండా ఎస్‌పీ 125 బైక్ ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో రూ.37, 500కు అమ్మకానికి అందుబాటులో ఉంది. అయితే దీనికి మాత్రం ఎలాంటి ఫైనాన్స్ సౌకర్యం లేదు. కాగా, సెకండ్ హ్యాండ్ బైక్‌లు కొనేటప్పుడు మీరు బైక్ యజమానిని కలవకుండా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ స్వయంగా ధృవీకరించకుండా మాత్రం మీ ఆర్ధిక లావాదేవీలు చేయకండి.అన్ని జాగ్రత్తగా పరిశీలించిన తరువాత మాత్రమే సెకండ్ హ్యాండ్ బైక్ లని కొనుగోలు చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి: