జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల్లో ప్రేమను పెంచే పనిలో పడ్డాడు .తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నల్లమల్ల అడవుల్లో  యురేనియం తవ్వకాలను   జరిపేందుకు కేంద్రం నిర్ణయించి  ప్రణాళికలు  సిద్ధం చేసుకుంటుంది ... ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకి ప్రాణవాయువును   ఇచ్చే పచ్చటి అడవి తల్లిని నాశనం చేయొద్దంటూ తెలుగు రాష్ట్రాలు సేవ్  నల్లమల్ల అంటూ ఉద్యమం  బాట పట్టాయి . తెలుగు రాష్ట్రాలకి పచ్చతోరణం లాంటి అడవిని యురేనియం తవ్వకాలు పేరుతో  నాశనం  చేస్తే మానవాళికి ముప్పు వాటిల్లుతుందని రాజకీయ నాయకులూ ,సినీ ప్రముఖులు , యువజన సంఘాలు సేవ్ నల్లమల్ల అంటూ నిరసన గళాలు విప్పాయి .


ఈ  నేపథ్యంలో సేవ్ నల్లమల్ల ఉద్యమం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలుపెరగని పోరాటం చేస్తున్నారు .అఖిల పక్ష నేతలతో సమావేశం  అయ్యి ... ఉద్యమ కార్యాచరణ పై వివరించారు .సమావేశాలు చర్చల ద్వారా ప్రజల్లో నల్లమల్ల ఆవశ్యకత పై  అవగాహనా కల్పిస్తూ ... ప్రజలందరూ సేవ్ నల్లమల్ల అంటూ ఉద్యమం వైపు నడిచేలా చైతన్య వంతులను  చేస్తున్నారు .తన సందేశాలతో అందరికి అడవితల్లి పై   ప్రేమను పెంచే పనిలో పడ్డారు  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .


ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అధికారిక ట్విట్టర్  ఖాతాలో ప్రకృతిపై ప్రేమను పెంచుకునేందుకు కొన్ని సలహాలు ఇచ్చారు . అందరు వనవాసి అనే అనువాద పుస్తకాన్ని చదవాలని సూచించారు .బనవాసి (తెలుగులో వనవాసి) అనే పుస్తకాన్ని భిభూతి భూషణ్ బందోపాధ్యాయ్  1938లో రచించగా ... దాన్ని సూరంపూడి సీతారాం తెలుగులోకి అనువదించారని తెలిపారు జనసేన అధినేత పవన్ .ఈ పుస్తకం చదివితే ఎవరైరా సరే ప్రకృతి ప్రేమికులుగా మారిపోతారన్నారు.వనవాసి పుస్తకం ప్రకృతిపై తన ప్రేమను మరింత పెంచిందని  అన్నారు పవన్.నల్లమల్ల ను కాపాడుకునేందుకు ముందుకు సాగుదామని నల్లమల్లని కాపాడుకుందామని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ .


మరింత సమాచారం తెలుసుకోండి: