మారుతీ సుజికీ.. ప్రముఖ దేశీయ కార్ల తయారీ దిగ్గజం.. ఇప్పుడు వాహన ప్రియులకు షాక్ ఇవ్వబోతోంది. వచ్చే ఏడాది నుంచి తన వాహనాలు ధరలు పెంచబోతోంది. మారుతీ సుజికీ సంస్థ నుంచి వస్తున్న వాహనాల విక్రయాలు ఇటీవల కాస్త తగ్గాయి. అయినా సరే వాహనాలు ధరలు పెంచాలనే ఆ కంపెనీ భావిస్తోంది.

 

మారుతీ సుజికీ నుంచి వచ్చే.. ఆల్టో, ఎస్‌-ప్రెస్సో, వేగనార్‌, స్విఫ్ట్‌, సెలిరియో, డిజైర్‌, సియాజ్‌ దేశీయ విక్రయాలు ఇటీవల 3.2శాతం తగ్గాయి. అయితే ముడిసరుకు ధరలు పెరగడం వల్ల ధరలు పెంచక తప్పడం లేదని ఆ సంస్థ చెబుతోంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయాన్ని రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో కూడా పేర్కొంది.

 

ఆ ప్రకటనలో ఏమని చెప్పిందంటే.. “ ముడిసరకుల ధరల ప్రభావం కంపెనీ తయారు చేసే వాహనాలపై తీవ్రంగా పడనుంది. ఈ ప్రభావాన్ని వినియోగదారులకు బదిలీ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. అందుకోసమే జనవరి 2020 నుంచి వివిధ మోడళ్లపై ధరలను పెంచుతున్నామని పేర్కొంది. అయితే ఏ మోడళ్లపై ధరలు పెరగుతాయో మాత్రం ప్రత్యేకంగా చెప్పలేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: