ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ దెబ్బకి ఎవరింటికి వారు పరిమితం కావడంతో రోడ్ల మీద వాహనాల సంఖ్య భారీగా తగ్గింది. దీనితో ప్రస్తుతం దేశంలో కాలుష్యం భారీగా తగ్గిందనే చెప్పవచ్చు. అంతేకాకుండా వాతావరణాన్ని కాపాడడానికి ఆటోమొబైల్ రంగంలో పెను మార్పులు వచ్చాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సంవత్సరం మొదటి నుంచి BS - 6 తగ్గట్టు పర్యావరణ సూచనలు పాటిస్తూ ఉత్పత్తులను పెంచుతున్నాయి ఆటోమొబైల్ కంపెనీలు.

అయితే తాజాగా భారత్లో ఎలక్ట్రికల్ కార్ల వినియోగం కాస్త నడుస్తోందని చెప్పవచ్చు. గత రెండు సంవత్సరాల నుంచి వీటిమీద భారతీయులు ఆసక్తిని చూపుతున్నారు. కాకపోతే ఇప్పటికే విద్యుత్ తో నడిచే బైక్స్, స్కూటర్లను సిటీలలో చాలా ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు ఇవన్నీ దేశంలోని నలుమూలలకు విస్తరింప చేయాలని ఆటోమొబైల్ కంపెనీలు ఆలోచనలు ఉన్నాయి. ఇక కార్ల విషయానికొస్తే హ్యుండాయ్ కోనా ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ ఇవి భారతదేశంలో మంచి మంచి మార్కెట్ ని సాదించుకున్నాయి. ఇక ఈ తరుణంలో ఈ సంవత్సరం కొత్త విద్యుత్ కార్లు భారత్ లోని ప్రజలకు సుపరిచితం కాబోతున్నాయి. అవేమిటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.


​నిసాన్ లీఫ్, ​జాగ్వర్ ఐ-పేస్, ​ఆడీ ఈ-టర్న్, పోర్షే టేకాన్, మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూసీ ఇలా కొన్ని కార్లను మార్కెట్లోకి రాబోతున్నాయి. ఇక వీటి వివరాల కోసం ఆయా కంపెనీలు వారివారి సైట్స్ లో పూర్తి వివరాలను పొందు పరిచారు.

 

 

 

ఏదిఏమైనా వాతావరణాన్ని కాపాడంలో ఆటో మొబైల్ రంగాలు ఇంకాస్త ముందంజ వేయాలని ఆశిద్దాము. మనం కూడా వాతావరణాన్ని కాపాడడానికి విలేనంతవరకు వాహన వినియోగాలను తగ్గించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని వినియోగిస్తే చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: