ప్రస్తుతం దేశీయ మార్కెట్లో బాగా ప్రసిద్ధి చెందిన మారుతి సుజుకి జిమ్ని మనదేశంలో లాంచ్ చేయబోయే ప్రముఖ SUV లలో ఇది ఒకటి. ప్రపంచవ్యాప్తంగా మంచి రేటింగ్స్ పొందిన సుజుకి జిమ్మీ మినీ SUV ను భారత మార్కెట్లో ఇప్పట్లో వచ్చేలా కనపడుట లేదు. అయితే ఈ కారు గురించి ఒకసారి పూర్తి వివరాలు తెలుసుకుందామా...

IHG

నిజానికి ఈ కార్ కోసం భారత్ లో చాలా మంది ఎదురు చూస్తున్నారు అని చెప్పవచ్చు. అయితే ఈ విషయంలో కాస్త వినియోగదారులకు ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే ఆ సంస్థ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుజుకి జిమ్మిను గురించి తెలిపారు. ఇంకా భారత దేశంలో జరిగిన కొన్ని అధ్యయనాల ప్రకారం దీనిని ఇంకా భారత్లో ప్రవేశపెట్టాలో లేదా అనే విషయంపై నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు. ఒకవేళ ఈ విషయంలో భారత్ లో లాంచ్ చేస్తే గుర్గావ్ ప్రదేశంలో దీన్ని తయారు చేసే అవకాశం ఉందని చెప్పి తెలియజేశారు.

IHG

నిజానికి ఈ  జిమ్ని కారుకు 2 వేరియంట్స్ ఉన్నాయి. సియెర్రా మరియు స్టాండర్డ్ అనే రెండు రకాల్లో ఈ కారు లభిస్తుంది. నిజానికి ఇలాంటి కార్లకు జపాన్ లో మంచి డిమాండ్ కూడా ఉంది. అయితే అక్కడ కూడా ఈ సుజుకి SUV కార్ రిలీజ్ చేయడానికి మరికొంత సమయం పడేలా కనిపిస్తుంది.అయితే ఈ మినీ SUV 2019 సంవత్సరం ప్రతిష్టాత్మక ప్రపంచ రికార్డును గెలుచుకుంది. అంతేకాకుండా అంతర్జాతీయంగా అనేక మంది వినియోగదారుల ప్రశంసలు పొందిన ఈ కార్ 2020 ఆటో ఎక్స్ పోలో చాలా మంది ప్రజలను ఆకట్టుకుంది. ఇక ఈ కారు ఇంజన్ విషయానికి వస్తే... ఫోర్ స్పీడ్ గేర్ బాక్స్ లేదా ఫైవ్ స్పీడ్ గేర్ బాక్సుతో జతచేయబడి ఉంటుంది. ఒకవేళ ఈ కార్ భారతదేశంలో విడుదల చేస్తే ప్రసిద్ధ జిప్సి SUV కి ఇది వారసత్వంగా వచ్చినట్లు అవుతుంది. ఇకపోతే భారతదేశంలో ఈ కారు కోసం చాలామంది వేచి చూస్తున్నారు అని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: