2019 నవంబర్ నెలలో థాయిలాండ్ దేశంలో ప్రపంచ వ్యాప్తంగా హోండా సిటీ కార్ అందుబాటులోకి వచ్చింది. మార్చి 16న హోండా సిటీ ఐదవ తరం భారత దేశంలో మొదలైంది. ఇక ఈ కారులో పెట్రోల్ వేరియంట్ లతోపాటు సిక్స్ స్పీడ్ MT, డీజిల్ వేరియంట్ లతో CVT గేర్ బాక్స్ లభించనున్నాయి.

IHG

ఇకపోతే ప్రస్తుత జెన్ సిటీ కంటే ఇది కాస్త ఎక్కువ రేంజ్ ఇందులో కనబడుతుంది. అంతేకాకుండా దీనికి మారుతి సుజుకి సియాజ్, అలాగే హుండాయ్ వెర్నా ఫేస్ లిఫ్ట్ భారత మార్కెట్లో పోటీగా నిలబడతాయి. అయితే  ఏప్రిల్ ఒకటో తారీకు నుంచి భారత ప్రభుత్వం విధించిన కొత్త నిబంధనల ప్రకారం కాలుష్య నియంత్రణకు అనుగుణంగా హోండా సిటీ కారును విడుదల చేయడం జరిగింది.

IHG


ఇక ఈ బిఎస్ 6 మోడల్ కారుకు, బిఎస్ 4 కారుకు ఉన్న వ్యత్యాసాలు గురించి చూస్తే.. హోండా సిటీ 2019 మోడల్ కారులో BS6, 1.5-లీటర్, i-VTEC పెట్రోల్ ఇంజిన్, 119 PS పవర్, 145Nm టార్క్, ట్రాన్స్మిషన్  5-స్పీడ్ MT - 17.4kmpl , CVT - 18 kmpl  మైలేజ్ కలిగి ఉండగా...

IHG

 

అదే హోండా సిటీ 2020 విషయం చూస్తే BS6,1.5-లీటర్, i-VTEC పెట్రోల్ తోపాటు VTC టెక్నాలజీ, 121PS పవర్, 145Nm టార్క్, ట్రాన్స్మిషన్  6-స్పీడ్ MT/7-స్పీడ్ CVT,  మైలేజ్  6-స్పీడ్ MT - 17.8kmpl కలిగి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: