యూత్ కు బైకులు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బండి వేసుకొని స్టంట్ చేయాలని, పది మంది ముందు గొప్పగా చూపించాలని అనుకుంటారు. అయితే అతి తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఉన్న బైక్ లను కొనడానికి ఎక్కువ ఇష్టపడతారు.. అలాంటి వారి కళలను హోండా గ్లామర్ బైక్ తీరుస్తుంది.. కొత్త హంగులతో.. మరికొన్ని అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్ లో దర్శన మిస్తున్నాయి.. తక్కువ ధరలో, ఎక్కువ మైలేజ్ తో, స్టయిల్ లుక్ తో ఉన్న బైక్ గ్లామర్ బైక్..



తాజాగా హీరో సంస్థ గ్లామర్ మోడల్లో బ్లేజ్ ఎడిషన్ ను భారత మార్కెట్ లోకి విడుదల చేసింది.ఎక్స్ షోరూంలో హీరో గ్లామర్ బ్లేజ్ ఎడిషన్ ప్రారంభ ధర వచ్చేసి రూ.72,000లుగా సంస్థ నిర్ణయించింది.. పండుగ సీజన్ కనుక గ్లామర్ మోడల్లోని బ్లేజ్ ఎడిషన్ కాస్మటిక్ అప్ గ్రేడ్ లను ముందుకొచ్చింది.హీరో గ్లామర్ బ్లేజ్ ఎడిషన్ మోటార్ సైకిల్ మ్యాటర్ వెర్నియర్ గ్రే పెయింట్ స్కీముతో అందుబాటులోకి వచ్చింది. సరికొత్త కలర్ తో పాటు గ్లామర్ బ్లేజ్ ఎడిషన్ లో హ్యాండిల్ బార్ లో యూఎస్బీ ఛార్జర్, బాడీ గ్రాఫిక్స్ ఫంక్ లైమ్ కలర్ వంటి వాటిని కలిగి ఉంది..



240 ఎంఎం ఫ్రంట్ డిస్క్ బ్రేక్, టెలిస్కోప్ పోర్కులు సస్పెన్స్ సెటప్, వెనుక భాగం డ్రమ్ బ్రేక్ సెటప్ మొదలగు ఫీఛర్లను కలిగి ఉంది.ఈ కంపెనీ బైకు లకు పెద్దగా మార్పులు చేయలేదు.కానీ ఈ ఒక్క బైక్ కు మాత్రం కొంత మార్పులు చేర్పులు చేశారని సంస్థ వెల్లడించింది..హీరో గ్లామర్ బ్లేజ్ ఎడిషన్ 124సీసీ సింగిల్ సిలీండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 10.7 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 10.6 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది... ఇలాంటి అన్నీ సదుపాయాలు , యువతకు నచ్చే కలర్స్ ఉంటడం తో మంచి సేల్స్ వస్తాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. ఈ పండుగ సీజన్ లో భారత్ మార్కెట్ లో సందడి చేస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: