ప్రస్తుతం కాలం పరుగులు పెడుతుంది..సైన్స్ పెరగడంతో అవసరాలు కూడా బాగా పెరిగాయి. వాటితో పాటుగా మనుషులలో డబ్బు ఆశ బాగా పెరిగింది. దీంతో ఎక్కడ చూసినా కూడా ఏదోక విషయం పై కొత్తగా కనిపెడుతూ న్నారు.. అయితే ఇప్పుడు కార్లకు మార్కెట్ లో డిమాండ్ ఉంది.. ఆ నేపథ్యంలో కార్ల కంపెనీలు కూడా కొత్త హంగులతో , ఫీచర్లతో సరి కొత్త టెక్నాలజీ ఉన్న కార్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. కాగా, వాటిలో ఏ కారు గొప్పగా ఉంటుంది అనే విషయాలలో కన్ఫ్యూజన్ అవుతున్నారు. అలాంటి వాళ్ళు ఒకసారి ఈ తేడాలను చూడండి..



హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్  కార్లు భారత దేశంలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వాటిలో ఏ కారును కొనాలో అర్థం కాక ప్రజలు సతమత మవుతున్నారు.. అదేంటో ఇప్పుడు చూద్దాం..హ్యుండాయ్ క్రెటా 1.4 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉండి 138 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 242 ఎన్ఎం టార్క్ ను కలిగి ఉంది. అంతేకాకుండా 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ కలిగిన క్రెటా వేరియంట్ ధర రూ.16.16 నుంచి 17.2 లక్షల మధ్య ధర అనేది ఉంటుంది. ఇక కియా సెల్టోస్ 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కూడా క్రెటా మాదిరే సేమ్ పవర్ ఔట్ పుట్ తో సమర్థ వంతంగా పని చేస్తుంది. స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పాటు 6-స్పీడ్ మ్యానువల్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది.



ఇక 1.4-లీటర్ టర్బో పెట్రోల్ మ్యానువల్ ట్రాన్స్ మిషన్ తో పనిచేసే కియా సెల్టోస్ ధర రూ.15.29 లక్షల నుంచి రూ.16.29 లక్షల మద్య పెట్ట వచ్చునని అంటున్నారు. దాదాపుగా ఈ రెండు కార్ల రేట్లు మాత్రం కాస్త దగ్గరగా ఉన్నాయి. ఇందులో చివరిగా పరిశీలించాల్సింది మాత్రం..క్రెటాలో ఐదు వేరియంట్ల మాత్రమే లభ్యమవుతుండగా.. కియా సెల్టోస్ లో మాత్రం ఈ వేరియంట్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇంజిన్, ఫీచర్లను పరిశీలించి ఈ రెండింటిలో ఏది తీసుకోవాలో అనేది ప్రజల అభిప్రాయానికి వదిలేయాలి. ఈ రెండు మంచి ఫీచర్లను కలిగి ఉంటున్నాయి..ధర బట్టి కారును కొనుగోలు చేసుకోవచ్చు..


మరింత సమాచారం తెలుసుకోండి: