తాజాగా పియాజ్జియో సంస్థ భారత్ లో వెస్ప ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తుంది.. ఈ బైక్ ఫీచర్స్ చూద్దాం..4.3 డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ బ్లూటూత్-స్మార్ట్ ఫోన్ కనెక్టువిటీ ఈ బైక్ సొంతం. 4 కిలోవాట్ల లైట్స్ బ్రష్లెస్ డిసి ఎలక్ట్రిక్ మోటార్, 200 నానో మీటర్ల అధిక మైలేజ్ ను ఇస్తుంది. ఒకసారి ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు 100 కిలో మీటర్లు రైడ్ చేయవచ్చునని అంటున్నారు. ఒక ఛార్జింగ్ కు నాలుగు గంటలు పడుతుంది. రౌండ్ హెడ్ లాంప్, కర్వీ ఫ్రంట్ ఆఫ్రన్, ముందు కాంట్రాక్ట్ కలర్ ఎయిర్ మెంట్లు, యాప్రాన్ మౌంటెడ్ ఇండికేటర్స్ తో దీన్ని రూపొందించారు..
మహిళలు ఈ బైక్ ను సులువుగా వాడుకోవచ్చు లైట్ వెయిట్ ఉంటుంది. అంతేకాదు స్టైల్ లుక్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ సందర్భంగా ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డియెగో గ్రాఫీ మాట్లాడుతూ కేవలం భారత వినియోగదారుల కోసమే ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ స్కూటర్ టూవీలర్ ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఈ స్కూటర్ డిజైన్, టెక్నాలజీని మరింతగా మెరుగు పరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ స్కూటర్లు యూరప్ లో విడుదలయ్యాయని వివరించారు.. దీన్ని ఎప్పుడు విడుదల చేస్తారని వివరాలను ఆ సంస్థ అధికారికంగా వెల్లడించలేదు. అయితే వచ్చే ఏడాది విడుదల కానుందని సమాచారం.. మరి మార్కెట్ లో ఎలా దూసుకుపోతుంది అనేది చూడాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి