
మారుతి సుజుకీ మాత్రం సత్తా చాటుతూనే ఉంది. తాజాగా ఏప్రిల్ నెలలో ఎక్కువగా అమ్ముడైన టాప్ 10 మోడల్స్‌లో 7 ఆ సంస్థకు చెందినవే కావడం విశేషం. ఇందులోనూ మారుతీ సుజుకీ వేగన్ ఆర్ టాప్ లో నిలిచింది. ఏప్రిల్ నెల లో అత్యధికంగా అమ్ముడు పోయిన కారు ఇదే. ఒక్క నెలలోనే దేశవ్యాప్తంగా 18,656 వేగన్ ఆర్ కార్లు అమ్ముడైనట్లు ఆటోమోటివ్ అనలిటిక్స్ అందించే సంస్థ జాటో డైనమిక్స్ ఇండియా వెల్లడించింది.
టాప్ టెన్‌లో మారుతి సుజుకీ నుంచి వేగన్ ఆర్ కాకుండా స్విఫ్ట్, ఆల్టో, బ్యాలెనో, డిజైర్, ఈకో, విటారా బ్రెజా ఉన్నాయి. ఇవి కాకుండా హ్యుండాయ్ నుంచి క్రెటా, గ్రాండ్ ఐ10 నియోస్, వెన్యూ ఉన్నాయి. ఏప్రిల్ లో మారుతీ సుజుకీ కి చెందిన వేగనార్ 18,656 యూనిట్లు, స్విఫ్ట్ 18,316 యూనిట్లు, ఆల్టో 800.. 17,303, బాలెనో 16,384, డిజైర్ 14,073, ఈకో 11,469, విటారా బ్రెజా 11,220 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇక హ్యుందాయ్ కు చెందిన గ్రాండ్ ఐ10 నియోస్ 11,540 యూనిట్లు, వెన్యూ 11,245, క్రెటా 12,463 యూనిట్ల ను విక్రయించారు. ఏప్రిల్ లో అమ్ముడైన ప్రయాణికు ల వాహనాల్లో 50 శాతం వాటా ఈ పది కార్లదే కావడం విశేషం.