ఇండియాలో బాగా పాపులర్ అయిన టీవీఎస్ మోటార్ కంపెనీ ఎట్టకేలకు ఇండియా మార్కెట్లో కొత్త 2021 Apache RR310 ని విడుదల చేయడం జరిగింది. ఇక ఈ కొత్త బైక్ ప్రారంభ ధర వచ్చేసి ఇండియా మార్కెట్లో రూ. 2.59 లక్షలు వుంది. ఇండియా మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కొత్త మోటార్‌సైకిల్ బ్రాండ్ అందించే బిల్డ్-టు-ఆర్డర్ ప్రక్రియ ద్వారా అనేక అప్డేట్స్ ఇంకా పర్సనలైజేషన్ ఆప్షన్స్ ని ఈ బైక్ కలిగి ఉంది.ఇండియా మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ గురించి పూర్త సమాచారం తెలుసుకోండి.2021 Apache RR310 బైకులు తక్కువ సంఖ్యలో మాత్రమే అమ్మబడతాయి. ఇక ఇందులో భాగంగానే సెప్టెంబర్‌ నెలలో 100 యూనిట్లు ఇంకా అక్టోబర్ నెలలో 150 యూనిట్లకు పరిమితం చేయబడతాయని కంపెనీ ప్రకటించడం జరిగింది. బుకింగ్ మొత్తం కూడా కాన్ఫిగరేషన్ ఖర్చుతో బాగా సమానంగా ఉంటుంది.

ఇక ఈ సరికొత్త 2021 Apache RR310 రెండు పర్ఫామెన్స్ కిట్స్ ని కలిగి ఉంటుంది.అందులో ఒకటి డైనమిక్ కిట్ రెండోది రేస్ కిట్.డైనమిక్ కిట్ ధర వచ్చేసి రూ. 12,000 ఉంటుంది. ఇక ఇందులో ఫుల్లీ అడ్జస్టబుల్ కెవైబి ఫ్రంట్ ఫోర్క్ అలాగే ఫుల్లీ అడ్జస్టబుల్ రియర్ మోనో షాక్ ఇంకా యాంటీ రస్ట్ బ్రాస్ కోటెడ్ డ్రైవ్ చైన్ ఉంటాయి.ఇక ఇందులోని ఫ్రంట్ ఫోర్క్ 20 మిమీ రీబౌండ్ ఇంకా 15 మిమీ ప్రీ-లోడ్ అడ్జస్టబుల్ కంప్రెషన్ డంపింగ్ అనేది కలిగి ఉంది. ఇక అదే విధంగా రియర్ మోనో-షాక్ విషయానికొస్తే.. ఇది 20-స్టెప్ రీబౌండ్ డంపింగ్ ఇంకా 15-స్టెప్ ప్రీ-లోడ్ అడ్జస్టబుల్ కలిగి ఉంది. అలాగే చివరగా, యాంటీ-రస్ట్ బ్రాస్ కోటెడ్ డ్రైవ్ చైన్ దీర్ఘకాలం ఉంటుంది. అలాగే ఈ మోటార్‌సైకిల్ రూపాన్ని మరింత మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇక రేస్ కిట్ మోడల్ ధర వచ్చేసి రూ. 5000 వరకు ఉంటుంది. ఇందులో రేస్ ఎర్గో హ్యాండిల్‌బార్ అలాగే పెరిగిన ఫుట్‌రెస్ట్ అసెంబ్లీ ఇంకా Knurled footpegs (నర్ల్ ఫుట్‌పెగ్స్) అనేవి వున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: