ఇటీవల ఇండియా మార్కెట్లో అనేక కొత్త కొత్త బైక్స్ విడుదలవుతున్నాయి. ఇప్పుడు ప్రముఖ బైక్ కంపెనీ Moto Guzzi india (మోటో గజ్జి ఇండియా) కొత్త బైక్ ని ఇండియా మార్కెట్లో విడుదల చేసింది.మన మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త 2022 Moto Guzzi V85 TT ధర వచ్చేసి రూ. 15.40 లక్షలు(ఎక్స్-షోరూమ్).ఇక ఈ కొత్త Moto Guzzi V85 TT బైక్ మంచి కలర్ ఆప్షన్లలో మార్కెట్లో మనకు అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ కలర్స్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా ఇంకా ఎంతో స్టైలిష్ గా ఉండి బైక్ వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉండే విధంగా తయారుచేయబడ్డాయి.ఇండియా మార్కెట్లో విడుదలైన కొత్త 2022 Moto Guzzi V85 TT బైక్ అనేది ఆకర్షణీయమైన గ్రాఫిక్స్ మోడల్. మనం ఇది వరకు చెప్పుకున్నట్లుగా 'జియల్లో మొజావే (ఎల్లో విత్ వైట్) ఇంకా రోసో ఉలూరు (వైట్ విత్ రెడ్)' కలర్ ఆప్షన్‌లలో ఇది లభిస్తుంది.అందువల్ల ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.


2022 Moto Guzzi V85 TT బైక్ రెడ్ కలర్ ఫ్రేమ్ ఇంకా డ్యూయల్ టోన్ కాంపోనెంట్‌లు అలాగే డబుల్ స్టిచ్డ్ బోర్డర్‌తో స్కై స్వెడ్ ఎఫెక్ట్ సాడిల్ పొందుతుంది. ఇవన్నీ కూడా బైక్ దూకుడు రూపాన్ని పెంచడంలో ఎంతగానో సహాయపడతాయి.Moto Guzzi V85 TT బైక్ లో మోటో గుజ్జి లోగో కూడా బ్లాక్ కలర్ రిమ్స్‌తో తయారు చెయ్యబడింది. Moto Guzzi V85 TT రివైజ్డ్ ఎలక్ట్రానిక్ ఇంజిన్ కంట్రోల్ సిస్టమ్‌తో పని చేస్తుంది. ఇక అంతే కాకుండా ఇందులో రైడ్-బై-వైర్ త్రాటల్ ఇంకా కలర్ TFT ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా బైక్ లవర్స్ ని చాలా ఆకట్టుకుంటాయి.ఇక ఈ కొత్త బైక్ లో ఇవి మాత్రమే కాకుండా, మోటో గుజ్జి V85 TT లో మాండెలో ఈగిల్ DRL లు ఇంకా క్రూయిజ్ కంట్రోల్ అలాగే ట్రాక్షన్ కంట్రోల్ ఇంకా ఏబీఎస్, హ్యాండ్ గార్డ్స్, అల్యూమినియం ఆయిల్ సంప్ గార్డ్ ఇంకా ఫోర్క్ స్టాన్చియన్ గార్డ్‌తో ఫుల్లీ ఎల్ఈడీ డబుల్ హెడ్‌లైట్ యూనిట్‌ వంటివి కూడా ఆకట్టుకునే విధంగా వున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: