ఇక ఫేమస్ బైక్ ఇంకా స్కూటర్ తయారీ కంపెనీ టీవీఎస్ మోటార్ ఇటీవల ఇండియా మార్కెట్లో కొత్త టీవీఎస్ రైడర్ అనే కమ్యూటర్ బైక్ ని విడుదల చేయడం జరిగింది. ఇండియా మార్కెట్లో విడుదలైన కొత్త టీవీఎస్ రైడర్ బైక్ ప్రారంభ ధర వచ్చేసి రూ. 77,500 గా వుంది. ఇక ఈ బైక్ ని విడుదల వెంటనే టీవీఎస్ కంపెనీ బుకింగ్స్ కూడా స్వీకరించడం ప్రారంభించింది. ఇప్పుడు కంపెనీ ఈ బైక్ డెలివరీలు కూడా ప్రారంభించడం జరిగింది.ఇక కంపెనీ ఇటీవల టీవీఎస్ రైడర్ మొదటి యూనిట్ ని ఘజియాబాద్‌లో ఒక యోగా మాస్టర్ కి డెలివరీ చేసినట్లు తెలిపడం జరిగింది.ఇక ఈ బైక్ ప్రస్తుతం రెండు వేరియంట్లలో విడుదలవ్వడం జరిగింది.ఇందులో ఒకటి డ్రమ్ వేరియంట్ బైక్ కాగా మరొకటి డిస్క్ వేరియంట్ బైక్ . డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర వచ్చేసి రూ. 77,500 కాగా, డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర వచ్చేసి రూ. 85,000 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.టీవీఎస్ రైడర్ ఇండియాలో 125 సిసి సెగ్మెంట్‌లో కంపెనీకి ఉన్న ఏకైక బైక్.టీవీఎస్ కంపెనీ ఈ కొత్త టీవీఎస్ రైడర్ బైక్ ని నాలుగు కలర్స్ లో అందించడం జరిగింది.

ఇక అవి ఫైరీ ఎల్లో, స్ట్రైకింగ్ రెడ్, బ్లేజింగ్ బ్లూ ఇంకా వికెడ్ బ్లాక్ కలర్స్ ఉన్నాయి.ఇక ఈ బైక్‌లో కంపెనీ ఎకో ఇంకా పవర్ అనే రెండు రైడ్ మోడ్‌లను అందించడం జరిగింది.టీవీఎస్ రైడర్ ఎంతో అద్భుతమైన డిజైన్ తో చాలా స్టైలిష్ గా ఉంటుంది. కంపెనీ ఈ బైక్ ని ఎక్కువగా యూత్ కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని విడుదల చేయడం జరిగింది. ఇక ఈ మోటార్‌సైకిల్ ముందు భాగంలో డిస్‌క్టివ్ హెడ్‌ల్యాంప్ సెటప్ అనేది ఉంది, ఇందులో LED లైటింగ్ ఇంకా అలాగే స్ప్లిట్ LED DRL లు కూడా ఉన్నాయి.ఈ మోటార్‌సైకిల్ వెనుక భాగంలో అయితే ఆకట్టుకునే స్ప్లిట్ LED టెయిల్‌ల్యాంప్ కూడా ఉంది.ఇక ఈ సూపర్ స్టైలిష్ బైక్ లో 10 లీటర్ డ్యూయల్ టోన్ ఫ్యూయల్ ట్యాంక్ ఇంకా సింగిల్-పీస్ హ్యాండిల్‌బార్ అలాగే డ్యూయల్ టోన్ ఫ్రంట్ మడ్‌గార్డ్ ఇంకా క్రాష్ ప్రొటెక్టర్లు అలాగే ఇంజిన్ సంప్ గార్డ్ ఇంకా స్ప్లిట్-సీట్లు అలాగే అప్-స్వీప్డ్ ఎగ్జాస్ట్, శ్యారీ గార్డ్, 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఇంకా హాలోజన్ టర్న్-సిగ్నల్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. ఇక ఈ ఫీచర్స్ అన్ని కూడా ఈ బైక్ ని ఎంతో ఆకర్షణీయంగా ఇంకా ఆకట్టుకునే విధంగా కనిపించేలా చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: