ఇండియాస్ ఫేమస్ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) భారత మార్కెట్లో అమ్ముతున్న నెక్సాన్ ఈవీ (Nexon EV) ఎలక్ట్రిక్ కారులో ఇటీవలే ఓ లాంగ్ రేంజ్ వెర్షన్ టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ (Tata Nexon EV Max) ను మార్కెట్లో రిలీజ్ చేసిన సంగతి తెలిసినదే. మార్కెట్లో ఇది XZ+ ఇంకా XZ+ Lux అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. దేశీయ విపణిలో ఈ కొత్త లాంగ్ రేంజ్ వెర్షన్ టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ కార్ ధరలు రూ.17.74 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. అయితే, ఈ రెండు వేరియంట్లలో లభించే ఫీచర్లు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఇక టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ కారును కంపెనీ రెండు వేరియంట్లు (XZ+ మరియు XZ+ Lux) ఇంకా రెండు రకాల చార్జర్ (3.3kW చార్జర్ మరియు 7.2kW ఏసి ఫాస్ట్ చార్జర్‌) ఆప్షన్లతో అమ్ముతుంది. ఇక ఈ లాంగ్ రేంజ్ వెర్షన్ నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ప్రత్యేకమైన ఇంటెన్సిటీ-టీల్ కలర్ ఆప్షన్ లో లభిస్తుంది. దీనితో పాటుగా డేటోనా గ్రే ఇంకా ప్రిస్టీన్ వైట్ అనే మరో రెండు కలర్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. అలాగే వీటిలో డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లు స్టాండర్డ్‌గా లభిస్తాయి. ఇక దీని ఓవరాల్ డిజైన్ స్టాండర్డ్ నెక్సాన్ ఈవీ లాగానే ఉంటుంది.ఇక నెక్సాన్ ఈవీ మ్యాక్స్‌లో XZ+ అనేది ఈ కార్ లో లభించే బేస్ వేరియంట్. ఈ వేరియంట్‌లో మల్టీ-మోడ్ రీజెన్ బ్రేకింగ్ సిస్టమ్, ఆటోమేటిహెడ్‌ల్యాంప్‌లు, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు ఇంకా ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, నాలుగు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు ఇంకా ఇంటెలిజెంట్ వాక్యూమ్-లెస్ బూస్ట్‌ అండ్ యాక్టివ్ కంట్రోల్‌తో కూడిన ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అలాగే ఆటో-హోల్డ్, మల్టీ-డ్రైవ్ మోడ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, జ్యువెల్డ్ కంట్రోల్ నాబ్, క్రూయిజ్ కంట్రోల్‌ ఇంకా అలాగే ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.అలాగే టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్‌లో XZ+ Lux అనేది ఇందులో లభించే టాప్-ఎండ్ వేరియంట్. ఈ టాప్-ఎండ్ వేరియంట్‌లో, పైన పేర్కొన్న బేస్ XZ+ వేరియంట్‌లో లభించే అన్ని ఫీచర్లు కూడా లభిస్తాయి. వాటికి అదనంగా,ఈ XZ+ Lux వేరియంట్‌లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెంటిలేషన్‌తో కూడిన ఫ్రంట్ లెథెరెట్ సీట్లు ఇంకా కొత్త మక్రానా బేజ్ కలర్ ఇంటీరియర్స్, ఆటో-డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ (IRVM) ఇంకా అలాగే ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్లు కూడా లభిస్తాయి. ఇక ఈ రెండు వేరియంట్లోల ఇతర సాధారణ ఫీచర్లు స్టాండర్డ్ మోడల్ లాగానే ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: