ఇక భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇంకా అత్యధిక అమ్మకాలు పొందుతున్న జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థల్లో ఒకటి 'ఆడి'.ఆడి కంపెనీ దేశీయ మార్కెట్లో A4, A6, A8 L, Q5, Q7, Q8, S5 స్పోర్ట్‌బ్యాక్, RS 5 స్పోర్ట్‌బ్యాక్ ఇంకా అలాగే RS Q8 వంటి పెట్రోల్ కార్లను విక్రయిస్తోంది. ఇంకా అదే సమయంలో ఎలక్ట్రిక్ వాహన విభాగంలో 'ఇ-ట్రాన్' బ్రాండ్ క్రింద ఇ-ట్రాన్ 50, ఇ-ట్రాన్ 55, ఇ-ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్ 55, ఇ-ట్రాన్ జిటి ఇంకా అలాగే ఆర్ఎస్ ఇ-ట్రాన్ జిటి వంటి వాటిని విక్రయిస్తోంది.ఇక ఆడి కంపెనీ ఇప్పుడు దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న తమ అన్ని కార్లపైన ధరలను పెంచనున్నట్లు కూడా అధికారికంగా ప్రకటించింది.ఇక ఈ జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ ఆడి కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, అన్ని కార్లపైనా కూడా 2.4 శాతం ధరలను పెంచనున్నట్లు తెలిపింది.అయితే ఈ ధరలు 2022 సెప్టెంబర్ 20 నుంచి అంటే వచ్చే నెల నుంచి కూడా పెరగనున్నాయి. కావున వచ్చే నెల నుంచి కొత్త ధరలు అనేవి అందుబాటులో ఉంటాయి.ఇన్‌పుట్ ఇంకా సప్లై చైన్ ఖర్చులు పెరగడం వల్ల కంపెనీ  ఉత్పత్తుల ధరలను కూడా పెంచవలసి వస్తోదని ఆడి ఇండియా హెడ్ 'బల్బీర్ సింగ్ ధిల్లాన్' ఒక ప్రకటలో తెలిపారు.


కావున వచ్చే నెల నుంచి కూడా ధరలు 2.4 శాతం పెరుగుతాయి.ఇక ఈ ధరల పెరుగుదల అనేది తప్పకుండా కూడా కొనుగోలుదారులపైనా కొంత ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అయితే దీని కోసం కంపెనీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది తెలియరావాలి. అలాగే రానున్న పండుగ సీజన్ లో ఎక్కువమంది కొత్త కార్లను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారు. కాబట్టి కంపెనీ కస్టమర్ల కోసం ఏవైనా కొత్త స్కీమ్స్ లేదా ఆఫర్స్ తీసుకువస్తుందా.. అనేది తెలియరావాలి.ఇక ఇదిలా ఉండగా ఆడి కంపెనీ ఇటీవల భారతదేశంలో తన క్యూ3 కోసం ఆన్‌లైన్ బుకింగ్‌లను కూడా స్వీకరించడం ప్రారంభించింది. కావున ఈ SUV కొనాలనే కస్టమర్లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా అధీకృత డీలర్‌షిప్ ని సందర్శించి ముందస్తుగా రూ. 2,00,000 చెల్లించి కార్ ని బుక్ చేసుకోవచ్చు. వీటి డెలివరీలు ఈ సంవత్సరం చివరినాటికి ప్రారభమవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: